Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

కరోనా స్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చురకలు…

కరోనా స్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చురకలు…
కరోనా సెకండ్ వేవ్ వస్తుందని వైద్యులు హెచ్చరించినా మారలేదు
ఇప్పుడు ఒకరినొకరు నిందించుకోవడం వల్ల ఉపయోగం లేదు
ప్రభుత్వం మరింత పారదర్శకంగా వ్యవహరించాలి: రామ్ మాధవ్

దేశంలో కరోనా వైరస్ ప్రస్తుత ఉద్ధ‌ృతికి ప్రభుత్వ, ప్రజల నిర్లక్ష్యమే కారణమని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ‘పాజిటివిటీ అన్‌లిమిటెడ్’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కరోనా మొదటి ఉద్ధృతి తర్వాత ప్రజలు, ప్రభుత్వాల్లో నిర్లక్ష్యం పెరిగిపోయిందని, ప్రస్తుత పరిస్థితికి అదే కారణమని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ రాబోతోందని మనకు తెలుసని, మరోవైపు వైద్యులు కూడా హెచ్చరించారని, అయినప్పటికీ మనం నిర్లక్ష్యాన్ని వీడలేదన్నారు.ప్రభుత్వాన్ని నిందించిన మోహన్ భగత్ ప్రజలను కూడా తప్పు పట్టారు. ప్రజల నిర్లక్ష్యం కూడా కారణమన్నారు. ప్రభుత్వం సరిగా వ్యవహరిస్తే ఈ పరిస్థితులు ఎందుకొస్తాయనే దానిపై ఎవరికీ వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే కరోనా వేవ్ దేశంలో విజృభించటానికి కారణమైందని పేర్కొన్నారు.పాలకులు ఈ విషయంలో పారదర్శికంగా వ్యవహరించాలని ఒకరిని ఒకరు నిందించుకొని ప్రయోజనం లేదని అన్నారు.

ప్రస్తుత పరిస్థితికి ఒకరినొకరు నిందించుకోవడం మాని పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారిపై పోరు విషయంలో ప్రభుత్వం మరింత పారదర్శకంగా వ్యవహరించాలని ఆరెస్సెస్ సీనియర్ నేత, బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పేర్కొన్నారు.పారదర్శికంగా వ్యవహరించటంలేదని ఆరెస్సెస్ ఇద్దరు నేతలు నొక్కి చెప్పటం పై బీజేపీ లో సైతం చర్చజరుగుతోంది.

Related posts

చంద్ర‌బాబు త్యాగం అంటే ప‌వ‌న్‌ను సీఎం చేస్తారా?: స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి!

Drukpadam

అమిత్ షాకు మాయావతి కౌంటర్…

Drukpadam

బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన మహిళానేత… జడ్పీటిసి పదవికి రాజీనామా!

Drukpadam

Leave a Comment