Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

షర్మిలకు 14 రోజుల రిమాండ్ …చర్లపల్లి జైలుకు తరలింపు ..

షర్మిలకు 14 రోజుల రిమాండ్ …చర్లపల్లి జైలుకు తరలింపు ..
-మే 8వ తేదీ వరకు రిమాండ్ లో షర్మిల
-పోలీసులపై చేయి చేసుకున్న కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి
-కారును వేగంగా పోనిచ్చి కానిస్టేబుల్ ను గాయపరిచారన్న లాయర్
-షర్మిల చర్యలు సమాజానికి తప్పుడు సంకేతాలు అందిస్తాయని వాదన
-ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అడ్డుకున్నారన్న షర్మిల లాయర్
-పోలీసులు కొట్టడంతో వారిని తోసేశానని చెప్పిన షర్మిల

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. మే 8వ తేదీ వరకు ఆమె రిమాండులో ఉండనున్నారు. సిట్ కార్యాలయాన్ని ముట్టడించిన అనంతరం టీ సేవ్ నిరాహార దీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరాలని షర్మిల నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇంటి నుండి షర్మిల బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేయగా వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్నందుకు గాను ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

షర్మిల సహా ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా షర్మిల, ఏ2గా కారు డ్రైవర్ బాలు, ఏ3గా మరో డ్రైవర్ జాకబ్ పేర్లను చేర్చారు. షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది ..అంతరం ఆమెను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు .

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఆమె బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం ఇరువైపుల వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేసింది.

తొలుత పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఇరవై నాలుగు గంటలూ పని చేస్తారని, అలాంటి వారి పైన చేయి చేసుకున్నారని, ఇలాంటి చర్యలు సమాజానికి తప్పుడు సంకేతాలు అందిస్తాయని పేర్కొన్నారు.

షర్మిల తన కారు డ్రైవర్ ను వేగంగా పోనివ్వాలని చెప్పారని, ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ కాలికి గాయాలు కూడా అయ్యాయని తెలిపారు. ఇది మాత్రమే కాకుండా, ఎస్సై పైన, మహిళా కానిస్టేబుల్ పైన ఆమె చేయి చేసుకున్నారని కోర్టుకు తెలిపారు.

మరోవైపు, షర్మిల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆమెకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు షర్మిలను బయటకు వెళ్లనీయడం లేదన్నారు. పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపారు.

ఓ ఎస్సై తనను చేతితో తాకే ప్రయత్నం చేశారని షర్మిల జడ్జికి తెలిపారు. పోలీసులు చాలామంది తనను అడ్డుకొని చెయ్యి విరిచే ప్రయత్నం చేశారని, తనను కొట్టారని, ఈ క్రమంలో తాను వారిని తోసేసినట్లు చెప్పారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

వైఎస్ షర్మిల కారు డ్రైవర్ అరెస్ట్… ఎందుకంటే..!

విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న కేసులో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షర్మిల కారు డ్రైవర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్ కాలి పైకి కారు ఎక్కించిన కేసులో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో షుగర్ 502 వచ్చింది. కానిస్టేబుల్ గిరిబాబు కాలి పైకి కారు ఎక్కించడంతో కాలి లెగ్మెంట్ కు గాయమైంది. దీంతో డ్రైవర్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో షర్మిలను ఏ 1గా, డ్రైవర్ బాలును ఏ2గా, మరో డ్రైవర్ జాకబ్ ను ఏ3గా నమోదు చేశారు. బాలును ముందే అరెస్ట్ చేయగా, జాకబ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు అతనిని అరెస్ట్ చేశారు.

కాగా, పోలీసులపై చేయి చేసుకున్న కేసులో షర్మిల పైన ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సిట్ కార్యాలయాన్ని ముట్టడించిన అనంతరం టీ సేవ్ నిరాహార దీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరాలని షర్మిల నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉదయం ఇంటి నుండి బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నేను బయటకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎస్సై రవీందర్ తో పాటు, మహిళా కానిస్టేబుల్ పైన చేయి చేసుకున్నారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం షర్మిలను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.

 

Related posts

వరద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రణాళిక రూపొందించండి!

Ram Narayana

81 ఏళ్ల కిందట 1000కి పైగా యుద్ధఖైదీలతో మునిగిపోయిన నౌక…. ఇప్పుడు బయటపడింది!

Drukpadam

పార్లమెంటు భవనం డిజైన్ శవపేటికలా ఉందన్న ఆర్జేడీ.. తీవ్రంగా స్పందించిన బీజేపీ

Drukpadam

Leave a Comment