Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అవసరమైతే తల ఇస్తాం…కానీ తలవంచం…సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

*అవసరమైతే తల ఇస్తాం. కానీ తల వంచం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని!
-ఇది మా నిబద్ధత పేదల కోసం ఎంతకైనా తెగించి కొట్లాడటం
-కార్మిక ,కర్షక శ్రేయస్సే మా విధానం..
-బ్లాక్ మైయిలింగ్ లేదు …చిల్లర వేషాలు వేయం
-ఒక పార్టీపై నిందలు వేసే ముందు వారి చరిత్ర తెలుసుకోవాలని హితవు

పార్టీ సిద్ధాంతాల కోసం ,ప్రజలసమస్యల పరిస్కారం కోసం అవసరమైతే తలా ఇస్తాం కానీ తలవంచమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
కూనంనేని సాంబశివరావు అన్నారు ఒక డిజిటల్ మీడియా లో బీఆర్ యస్ లో పొత్తులో భాగంగా సిపిఐ ,సిపిఎం లు ఎమ్మెల్సీ సీట్లకు అంగీకరించినట్లుగా వచ్చిన వార్తపై తీవ్రంగా స్పందించారు . సిపిఐ, సిపిఐ(ఎం) పార్టీలకు బిఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తు కుదిరినట్లు, ఇరుపార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఎం.ఎల్‌.సి. పదవులకు అంగీకరించినట్లు అభూతకల్పనతో ఏప్రిల్‌ 24వ తేదీన వార్తను ప్రచారించడంపై ఆయన మండిపడ్డారు . కమ్యూనిస్టు పార్టీలను శత్రుపార్టీలుగా భావించి, వారి ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర ఆ వార్తలో దాగి ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు .

ఇటీవల సర్వే చేసినట్లు, ఆ సర్వే రిపోర్టుల ప్రకారం పోటీ చేసే ఆలోచనను విరమించుకోమని కేసీఆర్ కోరినట్లు పార్టీల రాష్ట్ర కార్యదర్శులకు ఎం.ఎల్‌.సి. పదవులు ఆఫర్‌ చేసినట్లు వార్తలో పేర్కొనడం అత్యంత జుగుస్సాకరమని ,దుర్మార్గమని ఫైర్ అయ్యారు . కేసిఆర్‌ వారికి స్వయంగా చెప్పినట్లు ఈ వార్త వ్రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు . ఎన్నికలకు సంబంధించి ఎటువంటి చర్చలు జరగకపోయినా అన్ని జరిగిపోయినట్లు కథనాలు రాయడం విజ్ఞత అనిపించుకోదని పేర్కొన్నారు . జీవితాలు ఫణంగా పెట్టి కమ్యూనిస్టుపార్టీలను కాపాడుకుంటున్నామని ,పేదల ,కార్మికుల ,రైతుల , యువజన , విద్యార్థులు , మహిళల సమస్యలపై వారి గొంతుకగా , రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్న కమ్యూనిస్టులను బలపరచాల్సిన కార్మికులైన విలేకర్లు అందుకు భిన్నంగా వ్యవహరించడం తగదని హితవు పలికారు . సర్వే అనేది జరగకుండానే సర్వేకథనాలు వండి వడ్డించడం సరైందికాదని అన్నారు .

పోటీ చేసే 119 స్థానాలు గెలుస్తామని ఎవరూ అనుకోరు. కమ్యూనిస్టులు గెలువ లేకపోతే, పొత్తులోనున్న అధికారపార్టీ అయినా సరే తాను పోటీ చేసే అన్ని స్థానాలు గెలువగలుగుతుందా? రెండు కమ్యూనిస్టుల కార్యదర్శులు ఎం.ఎల్‌.సి. స్థానాలు తీసుకొని ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికైన సిద్ధపడినట్లు వార్త రాయటం అంటే కమ్యూనిస్టు పార్టీలంటే ఎంత ద్వేషం ఉందో అర్థమవుతుందన్నారు . ఏ పొత్తు అయినా అన్ని స్థాయిల కమిటీలలో చర్చించి, కేంద్ర పార్టీ సూచన మేరకు కమ్యూనిస్టు పార్టీల పొత్తులు ఉంటాయనే విషయం తెలుసుకోవల్సిందిగా విజ్ఞప్తి చేశారు .

కమ్యూనిస్టుపార్టీలు ప్రజల కోసం పుట్టిన పార్టీలు. అధికారం లేకపోయినా వందేళ్లయినా కమ్యూనిస్టుపార్టీ ప్రతిష్టను ఎవ్వరూ తగ్గించలేరు. గౌరవ ప్రధంగా లేని ఎన్నికల పొత్తులకి కమ్యూనిస్టుపార్టీలు ఎప్పటికీ తలవొంచబోము. అవసరమైతే గెలుపైనా, ఓటమైనా ముందుకు సాగుతూనే ఉంటాయి. ఎవరి దయాదాక్షిణ్యాలకు తలవొగ్గం. దయచేసి కమ్యూనిస్టుల జోలికి రాకండని కూనంనేని ఘాటుగా స్పందించారు . అవసరమైతే తల ఇస్తాం. కాని తల వంచం. ఇది మా నిబద్దత. ఎవరికి ఇష్టమున్నా, లేకపోయినా అసెంబ్లీ ఎన్నికలలో గెలువడం ద్వారా ఉభయ కమ్యూనిస్టుపార్టీలు శాసనసభలోకి అడుగు పెట్టి ఎర్రకాంతులతో వెలుగులు చూపుతామన్నారు .

Related posts

కేంద్రం అనూహ్య నిర్ణయం…రిజూజీ నుంచి న్యాయశాఖ తొలగింపు …

Drukpadam

ఐదేళ్లూ ఆయనే సీఎం….మంత్రి పాటిల్ కీలక వ్యాఖ్యలు..

Drukpadam

మూడు రాజధానులపై అసెంబ్లీ లో జగన్ ప్రకటన… చంద్రబాబు గుస్సా!

Drukpadam

Leave a Comment