అకాల వర్షం ఒకవైపు..ప్రభుత్వం మరొవైపు రైతుల్ని ముంచేస్తున్నాయి: పీపుల్స్ మార్చ్ లో భట్టి…
-కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చినా,,కొనుగోలు చేయని అధికారులు
-అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి
-ధాన్యం కొనుగోలులో జాప్యం వర్షాలకు తడిసి నష్టపోతున్న రైతుల గోడు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఈ రోజు మధ్యాహ్నం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి చేరుకుంది. పేదల భాదలు వింటూ ,రైతుల కష్టాలు తెలుసుకుంటూ పీపుల్స్ మార్చ్ లో ముందుకు సాగుతున్నభట్టి… అదే సమయంలో ధర్మసాగర్ చేరుకున్న భట్టి విక్రమార్క వద్దకు వచ్చిన రైతులు అల్లడి ఎల్లమ్మ, బంక రాకేష్ లు తమ కన్నీటి గోసను చెప్పుకున్నారు.
ధర్మసాగర్ ఐకేపీ కేంద్రానిక 5 లారీల ధాన్యం తెచ్చి పది రోజులు అయింది. ఇప్పటి వరకూ అధికారులు కొనుగోలు చేయలేదు. ఎన్నిసార్లు అడిగినా ఈరోజు, రేపు అని తిప్పుకున్నారు కానీ కోనుగోలు చేయలేదని కన్నీటి పర్యంతమవుతూ భట్టి విక్రమార్కకు చెప్పారు.
ఈ అకాల వర్షానికి 5 లారీల ధాన్యం మోత్తం తడిసిపోయింది. మొలకలు వచ్చాయి. మొత్తం పంటంతా నష్టపోయాము. ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేసుంటే మా బతుకులు బాగుపడేవంటూ.. భట్టికి చెప్పకున్నారు. అంతా విన్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మీకు, మీలాంటి అన్నదాతల కోసమే మేమంతా రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్నామని చెప్పారు. మీకందరికీ న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని చెప్పారు.
గౌడన్నల అభిమానం
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై గీత కార్మికులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయమంలో గీత కార్మికుడు బైరి నాగన్న భట్టి వద్దకు వచ్చి.. తాటి ముంజలు తినిపించారు. ఎండనక, వాననక నడుస్తూ వస్తున్నారు.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండని ఆప్యాయంగా చెప్పారు.
మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి.. అప్పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఫీజు రీ ఎంబర్స్ మెంట్ వల్ల ఎందరో పేద బిడ్డలు పెద్దపెద్ద చదువులు చదువుకున్నారు. అలాగే ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి.. ఆరోగ్య శ్రీ వల్ల మాలాంటివాళ్లు ఎందరో పెద్దపెద్ద దవాఖానాల్లో చూపించుకున్నాము.. అప్పుడు ఇచ్చింది మీరే కాబట్టి.. ఇప్పుడు మీరే వాటిని మళ్లీ ఇవ్వాలని కోరారు.
నాగన్న మాటలకు స్పందించిన సీఎల్పీ నేత.. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని మళ్లీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.