మీడియాతో మాట్లాడుతూనే కుప్పకూలిన వైఎస్ షర్మిల…!
వర్షాలకు భారీగా పంట నష్టపోయిన రైతులను ఆమె పరిశీలించారు.
పంట చేతికొచ్చే సమయానికి వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన
ఖమ్మం జిల్లాలో ఇటీవల దెబ్బతిన్న పంటపొలాలను ,ధాన్యపు రాశులను ఆదివారం పరిశీలించారు . అనంతరం ఆమె ఖమ్మంజిల్లాలో మీడియా తో మాట్లాడుతూ ఎండలో వడదెబ్బకు స్పృహతప్పి పడిపోయారు . ఈ హఠాన్పరినంతో ఆమె అనుచరులు , మీడియా వారు షాక్ కు గురైయ్యారు . కొద్దిసేపు ఆమెకు గాలి వచ్చేలా ఆమె అనుచరులు చర్యలు చేపట్టారు . మంచినీరు అందించారు . దీంతో ఆమె కొద్దిసేపటి తర్వాత తిరిగి లేచి నిలబడి మీడియా తో మాట్లాడారు ..
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. ఇవ్వాళ ఆమె పర్యటన మూడోరోజుకు చేరుకుంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టపోయిన రైతులను ఆమె పరామర్శిస్తోన్నారు. తొలుత- ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగాం, డోర్నకల్ నియోజకవర్గాల్లో పర్యటించారు.
అలింపూర్, గంగాపూర్‌లల్లో రైతులను పరామర్శించారు. రెండో రోజు జనగాం జిల్లాలో తిరుమలగిరి, తొర్రూర్, మర్రిపెడల్లో పంటలను పరిశీలించారు. కురవి మండలం అయ్యగారిపల్లిలో రైతులను పరామర్శించారు. ఈర్లపూడిలో రాత్రి బస చేశారామె. అనంతరం జనగా జిల్లా బచ్చన్నపేట మండలంలో అకాల వర్షం వల్ల ధ్వంసమైన వరి పంట, మామిడి తోటలను పరిశీలించారు. రైతులను పరామర్శించారు.
పంట చేతికొచ్చే సమయానికి వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారని, వారిని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వంపై ఉందని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు 10,000 రూపాయలను చెల్లిస్తామంటూ కేసీఆర్ ఇచ్చిన హామీలు గాలిమాటలయ్యాయంటూ మండిపడ్డారు. 5,000 రూపాయలను రైతుబంధు కింద ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాడంటూ ధ్వజమెత్తారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యవారిపల్లెలో అకాల వర్షంతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. వరి, మొక్కజొన్న, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇప్పటి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ రైతులను పరామర్శించడానికి రాలేదని చెప్పారు. తక్షణమే రైతులకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.
ఇవ్వాళ మూడోరోజు- వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటిస్తోన్నారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం ముటాపురంలో వీరన్నస్వామి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి వైరా నియోజకవర్గానికి బయలుదేరి వెళ్లారు. ఈ నియోజకవర్గంలో అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను కలిసి మాట్లాడారు. కొణిజర్ల మండలంలోని తనికెళ్ల, బోనకల్ మండలంలోని లక్ష్మీపురంలల్లో రైతులను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రైతు ద్రోహిగా అభివర్ణించారు. పంట పెట్టుబడికి, జరిగిన నష్టానికి ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన నష్టపరిహారం ఏమాత్రం సరిపోదని, ఎకరానికి 30,000 రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేశారు. విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో వైఎస్ షర్మిల్ అస్వస్థతకు గురయ్యారు. మాట్లాడుతూనే నీరసంతో స్పృహ తప్పారు. వెంటనే పార్టీ కార్యకర్తలు ఆమెకు సపర్యలు చేశారు.