Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ నేతలకు పొంగులేటి రెడ్ కార్పెట్

పొంగులేటిని నివాసంలో బీజేపీ నేతలకు రెడ్ కార్పెట్…

పొంగులేటి రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ …
-పొంగులేటితో బీజేపీ నేతల చర్చలు సంపూర్ణం …నిర్ణయం సశేషం
-లోన చర్చలు …బయట పెదవి విరుపులు
-జూపల్లి , పొంగులేటితో ఏకాంతంగా మాట్లాడిన బీజేపీ నేతలు
-అవసరమైతే మెట్టు దిగుతానన్న పొంగులేటి
-ప్రజాభీష్టం మేరకే నిర్ణయం ఉంటుందని మరోసారి పొంగులేటి వెల్లడి
-జూపల్లితో కలిసి మీడియా తో మాట్లాడిన పొంగులేటి
-పొంగులేటిని బీజేపీలోకి ఆహ్వానించడానికి వచ్చామన్న ఈటెల
-బీఆర్ యస్ వ్యతిరేక శక్తులను కూడగడతున్నామని స్పష్టికరణ
-దాదాపు 5 గంటలకు పైగా పొంగులేటి నివాసంలో బీజేపీ నేతలు
-ఇంటికి వచ్చిన వారికీ ఆతిధ్యం ఇచ్చిన పొంగులేటి …

మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలోని నివాసానికి గురువారం బీజేపీ నేతలు వచ్చారు .వారికీ రెడ్ కార్పెట్ తో ఆహ్వానం పలికారు . వీరి రాకకు కొద్దిగా ముందు బీఆర్ యస్ నుంచి సస్పెన్షన్ కు గురైన మరో నేత జూపల్లి కూడా వచ్చారు . బీజేపీనేతలు జరిపిన చర్చలు సంపూర్ణం అయినట్లు తెలుస్తుంది. అయితే పార్టీలో చేరిక నిర్ణయం సశేషంగా మిగిలింది. నిర్ణయం కోసం మరికొద్ది రోజులు ఆగాల్సిందే అని ప్రకటించారు పొంగులేటి ,జూపల్లి లు .. అయితే చర్చల అనంతరం బయటకు వచ్చిన నేతలు మీడియా తో ముక్త సరిగా మాట్లాడారు . పొంగులేటిని బీజేపీ పార్టీలోకి ఆహ్వానించాడనికే వచ్చామని చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ అన్నారు . పొంగులేటి మాట్లాడుతూ అవసరమైతే ఒక మెట్టు దిగుతానని పేర్కొనడం గమనార్హం … అయితే పొంగులేటి బీజేపీలోకి పోవడం ఖాయమైందని జరుగుతున్న ప్రచారానికి వీరి కలయిక ఊతం ఇచ్చేదిగా ఉంది. పొంగులేటి రాజకీయ అడుగులపై అనుయాయుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పొంగులేటి నిర్ణయంపై ఇంకా ఫైనల్ కాలేదు .. అయినప్పటికీ బీజేపీలోకి వెళ్లడం ఖాయమైందని జరుగుతున్న ప్రచారం పై కొందరు పెదవి విరుస్తున్నారు .నిజంగా పొంగులేటి బీజేపీలోకి వెళ్లడం ఖాయమైతే తమ దారి చూసుకునేందుకు కొందరు సిద్దపడుతున్నారు .

జిల్లాలో ఎలాంటి ఉనికి లేని బీజేపీని భుజానికి ఎత్తుకోవడం, ఉమ్మడి జిల్లాలో 10 కి 10 సీట్లు గెలిపిస్తామని, ఒక్క బీఆర్ యస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు తాకకుండా చేస్తామని చేసిన ఛాలంజ్ పై నిలబడతారా…? లేదా అనేది చూడాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో బీజేపీ ఒక సీటు అయినా గెలుస్తుందా …?లేదా అనేది చెప్పలేని పరిస్థితి …ఒక వేళ ఒకటి అరా గెలిచినా అది బీజేపీ విధానాలు ఓటర్లకు నచ్చి మాత్రం కాదు .వ్యక్తుల ప్రభావమే ఉంటుంది….

ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే జూపల్లి, పొంగులేటిలతో భేటీ: ఈటల రాజేందర్

Etala Rajender asks Jupalli and Ponguleti to join BJP

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులది, తమ పార్టీ లక్ష్యం ఒక్కటేనని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఇద్దరి నేతలతో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల బృందం భేటీ అయింది. ఖమ్మంలో పొంగులేటి, జూపల్లిలతో భేటీ అయిన వారిలో ఈటల, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భేటీ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. 

పొంగులేటి, జూపల్లి, తమ లక్ష్యం అందరిదీ ఒక్కటేనని చెప్పారు. వీరిద్దరు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కుటుంబ పరిపాలన అంతమొందించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని చెప్పారు. ప్రధాని వాగ్ధానం నెరవేర్చాల్సిన బాధ్యత అమిత్ షా, జేపీ నడ్డాలపై ఉందన్నారు. అధిష్టానం ఆదేశాలతోనే వీరిని కలిశామని, కేసీఆర్ నిరంకుశ పాలనను బొంద పెట్టే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. బీజేపీలో చేరాలని వారిని కోరినట్లు చెప్పారు. కేసీఆర్ డబ్బు సంచులతో కొనే ప్రయత్నం చేస్తున్నారని, కానీ అవి చెల్లవన్నారు.

బీజేపీ నేతలతో చర్చల అనంతరం పొంగులేటి జూపల్లి మీడియాతో …

రాజకీయాల్లో రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోలేం…!
-ఆలస్యమైనా… ప్రజామోదయోగ్యం వైపే మొగ్గు
-ఎజెండా ఉంది…. జెండా ఎంటో త్వరలోనే వెల్లడిస్తాం
-బీజేపీ నేతలతో భేటీ అనంతరం మాజీ మంత్రి జూపల్లి, మాజీ ఎంపీ పొంగులేటి

రాజకీయాల్లో రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోనే పరిస్థితి ఉండదు… ఆలస్యమని భావిస్తున్న వారందరికీ మా సమాధానం ఒక్కటే …. తప్పకుండా ప్రజామోదయోగ్యం వైపే మొగ్గు చూపుతామని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి బీజేపీ నేతలతో గురువారం భేటీ ముగిసిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… మభ్యపు మాటలతో మూడోసారి కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి రానివ్వకపోవడమే తమందరి అంతిమ లక్ష్యమన్నారు. అందుకోసం రెండు మెట్లు కాదు… ఎన్ని మెట్లు దిగడానికైనా తాము సిద్ధమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కాదు ఇతరత్రా పార్టీల నుంచి కూడా ఆహ్వానం ఉందన్నారు. కేసీఆర్ ను అధికారంలోకి రానివ్వదనేదే తమ ప్రధాన ఎజెండా అని త్వరలోనే జెండా ఎంటో ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం జరిగిన భేటిలో కేసీఆర్ ను నిలువరించేందుకు తాము ఏ విధంగా ముందుకు వెళ్తున్నామో బీజేపీ నేతలతో చర్చించినట్లు తెలిపారు. వారు కూడా తమ విధివిధానాలను వెల్లడించారని పేర్కొన్నారు. ఇంకా చర్చలు తొలిదశలోనే ఉన్నాయని కాస్తా ఆలస్యమైనా ప్రజాభీష్టా నిర్ణయానికే జై కొడతామన్నారు. అంతే తప్ప ఫలానా పార్టీ వైపు తాము మొగ్గుచూపుతున్నాం అని వస్తున్న వార్తలన్ని అవాస్తవమని కొట్టిపారేశారు.

 

Related posts

అష్రఫ్ ఘనీ రూ. 1255 కోట్లతో పారిపోయారు … లేదు లేదు నన్ను షూ కూడా వేసుకోనివ్వలేదు !

Drukpadam

కర్నూలులో సజ్జలకు నిరసన సెగ… అడ్డుకున్న దళితసంఘాలు!

Drukpadam

తరలింపే తక్షణ ప్రధాన కర్తవ్యం: 31 పార్టీల అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టీకరణ!

Drukpadam

Leave a Comment