Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

శరద్ పవార్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి…!

శరద్ పవార్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి…!

  • ఎన్సీపీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన శరద్ పవార్
  • రాజీనామా నిర్ణయంపై మరోసారి ఆలోచించాలన్న స్టాలిన్
  • లౌకిక కూటమి బలోపేతంలో పవార్ కీలకమని, తిరిగి పార్టీ బాధ్యతలు చేపట్టాలని విజ్ఞప్తి

ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా చేసి రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన్ను సొంత పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా కోరుతున్నారు. కొత్త చీఫ్ ఎంపికపై ఏర్పాటైన కమిటీ కూడా.. శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించింది. పార్టీని ఆయనే నడిపించాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పింది.

ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. తన నిర్ణయాన్ని మరోసారి ఆలోచించాలని శరద్ పవార్ ను ఆయన కోరారు. శుక్రవారం ఈ మేరకు ట్వీట్ చేశారు.

‘‘రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల చుట్టూ జాతీయ రాజకీయాలు కేంద్రీకృతమై ఉన్నాయి. దేశంలో లౌకిక కూటమిని బలోపేతం చేయడంలో కీలకమైన శరద్ పవార్.. ఎన్సీపీ చీఫ్ పదవి విషయంలో మరోసారి ఆలోచించాలి. ఎన్సీపీకి తిరిగి నాయకత్వం వహించాలని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు.

శరద్ పవార్ రాజీనామాను ఏకగ్రీవంగా తిరస్కరించిన ఎన్సీపీ ప్యానల్

NCP Panel Committee rejects Sharad Pawar Resignation

ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజీనామాను పార్టీ ప్యానల్ తిరస్కరించింది. పార్టీ అధినేతగా ఆయనే కొనసాగాలని తీర్మానించింది. కాసేపటి క్రితం ఎన్సీపీ ప్యానల్ మీటింగ్ ముగిసింది. అనంతరం పార్టీ వైస్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ… పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు మే 2న శరద్ పవార్ ప్రకటించారని… తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి పార్టీలోని కీలక నేతలతో కూడిన ఒక కమిటీని ఆయన ఏర్పాటు చేశారని తెలిపారు.

పవార్ రాజీనామా ప్రకటనతో తామంతా షాక్ కు గురయ్యామని… ఆయన నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని తాము ఊహించలేదని చెప్పారు. తనతో పాటు పలువురు నేతలు శరద్ పవార్ ను కలిసి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరామని… ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకే కాకుండా, దేశానికి కూడా మీ అవసరం ఉందని చెప్పామని ప్రఫుల్ పటేల్ అన్నారు.

తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తల డిమాండ్ల మేరకు ఈరోజు ప్యానల్ కమిటీ భేటీ అయిందని… పార్టీ అధినేతగా పవార్ కొనసాగాలంటూ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని తెలిపారు. దేశంలోని గొప్ప నాయకుల్లో శరద్ పవార్ ఒకరని కొనియాడారు. ఈ సమావేశంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అన్న కుమారుడు అజిత్ పవార్ కూడా పాల్గొన్నారు.

Related posts

పాపం మేయర్ పోలీసులు తనకు సెల్యూట్ చేయడంలేదని ఆవేదన…

Drukpadam

బీజేపీతో పెట్టుకుంటే మాడిమసైపోతారు..కేసీఆర్ కు బండి సంజయ్ హెచ్చరిక!

Drukpadam

రాహుల్ గాంధీతో జ‌గ్గారెడ్డి భేటీ…

Drukpadam

Leave a Comment