Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బీహార్ ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల భారీ జరిమానా…!

బీహార్ ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల భారీ జరిమానా…!

  • వ్యర్థాల నిర్వహణలో విఫలమైనందుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఫైన్
  • రెండు నెలల్లో ఈ మొత్తం జమ చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
  • ఈ డబ్బును వేస్ట్ మేనేజ్‌మెంట్ కు వినియోగించాలని సూచన

ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో విఫలమైనందుకు గాను బీహార్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ రూ.4,000 కోట్ల భారీ జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వేస్ట్ మేనేజ్‌మెంట్ లో బీహార్ ప్రభుత్వం అలసత్వంపై ఎన్జీటీ అసహనం వ్యక్తం చేసింది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, సుప్రీం కోర్టు, ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం ఇది చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని, దీంతో ప్రభుత్వానికి రూ.4వేల కోట్ల ఎన్విరాన్‌మెంటల్ సెస్ విధిస్తున్నట్లు తెలిపింది.

ఈ మొత్తాన్ని రెండు నెలల్లో రింగ్ ఫెన్స్డ్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలని, ఈ ఖాతా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధీనంలో ఉంటుందని, సీఎస్ ఆదేశాల మేరకు ఈ ఖాతాలోని మొత్తాన్ని వేస్ట్ మేనేజ్ మెంట్ కు మాత్రమే వినియోగించాలని గ్రీన్ ట్రైబ్యునల్ తెలిపింది. గత ఏడాది బెంగాల్ ప్రభుత్వానికి కూడా రూ.3,500 కోట్ల జరిమానా విధించింది గ్రీన్ ట్రైబ్యునల్.

Related posts

తరిగిపోతున్న వేప సంపద.. ఎకరాకు 20 చెట్లున్నా.. రూ.15 వేల ఆదాయం!

Drukpadam

పట్టభద్రుల ఎన్నిక మార్చ్ 14 న

Drukpadam

అమ్మాయిలు దొరకడం లేదని ఆవేదన.. పెళ్లి కాని ప్రసాదుల వినూత్న నిరసన!

Drukpadam

Leave a Comment