Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీని మట్టి కరిపించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నాం: మల్లికార్జున ఖర్గే…!

బీజేపీని మట్టి కరిపించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నాం: మల్లికార్జున ఖర్గే…!

  • ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు
  • ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు
  • ఈసారి హంగ్ వచ్చే అవకాశమే లేదన్న ఖర్గే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని మట్టి కరిపించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఈసారి హంగ్ వచ్చే అవకాశమే లేదని… కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ వస్తుందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమిపాలయితే తానే బాధ్యత తీసుకుంటానని చెప్పారు.

ఎన్నికల నేపథ్యంలో తాను సుడిగాలి పర్యటనలు చేస్తున్నానని… సాయంత్రం సభల్లో పాల్గొనడానికి 100 కిలోమీటర్లు కూడా ప్రయాణిస్తున్నానని తెలిపారు. బీజేపీని ఓడించడానికే అన్ని కష్టాలను భరిస్తున్నామని చెప్పారు. కాగా, ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ప్రధాని మోదీ కూడా వరుస ర్యాలీలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ,కాంగ్రెస్ లు హోరాహోరి తలపడుతున్నాయి. గెలుపు మాదంటే …మాదేనని చెప్పుకుంటున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని సర్వే లు కాంగ్రెస్ కె పట్టం కడుతున్నాయి. అయితే బీజేపీ మాత్రం మిరకిల్ సృష్టిస్తామని చెపుతుంది. రెండు పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి,. ప్రధాని మోడీ , కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా , సీఎం బొమ్మై , మాజీ సీఎం యడ్యూరప్ప బీజేపీ స్టార్ కంపైనర్లుగా విస్త్రత పర్యటనలు చేస్తున్నారు . కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ , ప్రియాంక , ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , మాజీ సీఎం సిద్దరామయ్య , కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ లు స్టార్ కంపైనర్లుగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు . దీంతో ఓటర్లు ఎన్నికల వాగ్దానాలతో తడిసి ముద్దవుతున్నారు.

Related posts

తెలంగాణలోనూ శ్రీలంక పరిస్థితే … కేసీఆర్ పాలనపై ఎంపీ కోమటిరెడ్డి ధ్వజం

Drukpadam

ఢిల్లీ విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీ సర్కార్ … బెడిసి కొట్టిన బీజేపీ ప్లాన్

Drukpadam

రాహుల్ గాంధీతో భేటీ అయిన ప్రశాంత్ కిశోర్…

Drukpadam

Leave a Comment