Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇంగ్లాండ్ ఎన్నికల్లో ఖమ్మం వాసి నాగేంద్ర లేబర్ పార్టీ నుంచి కౌన్సిల్ కు ఎన్నిక!

ఇంగ్లాండ్ ఎన్నికల్లో ఖమ్మం వాసి నాగేంద్ర లేబర్ పార్టీ నుంచి కౌన్సిల్ ఎన్నిక!
కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల తల్లిదండ్రుల ఆనందం
కొడుకు విజయంపట్ల ఖమ్మంలో తల్లిదండ్రులకు అభినందనల వెల్లువ

ఇంగ్లాండ్ దేశం హోకింగ్ హోం టౌన్ కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల్లో ఖమ్మం బైపాస్ రోడ్డు, జర్నలిస్టు కాలనీకి చెందిన నాగెండ్ల నాగేంద్ర సత్తా చాటారు. ఖమ్మం నగరంలోని జర్నలిస్టు కాలనీలో నివాసం ఉంటున్న సీనియర్ జర్నలిస్టు నాగేండ్ల శివానంద విజయమ్మ దంపతుల పెద్ద కుమారుడు నాగెండ్ల నాగేంద్ర ఇంగ్లాండ్ దేశంలో నివాసం ఉంటున్నారు. మే నాలుగున హోకింగ్ హోం టౌన్ కౌన్సిల్ ఎన్నికలో ఆయన లేబర్ పార్టీ నుంచి ప్రాతినిథ్యంవహిస్తూ పోటీలో పాల్గొన్నారు. నాగేంద్ర తన వార్డులో అత్యధిక ఓట్లు సాధించారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలు కావడమే కాకుండా ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. నాగేంద్ర వచ్చే వారం తాను విధులలో చేరడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. వివిధ స్థాయిల్లో హోకింగ్ హోం నివాసితులు నాగేంద్రకు ఆసక్తిగా మద్దతునిచ్చారు. నాగేంద్ర హోకింగ్ హోం నివాసితులు. ఈ సందర్భంగా నాగేంద్ర హోకింగ్ హోం లేబర్ పార్టీ నాయకురాలు అండీ క్లోయ్, పార్టీ అధినేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కొడుకు ఇంగ్లాండ్ దేశం వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తూనే స్థానిక కౌన్సిల్ కు జరిగిన ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు శివానంద ,విజయమ్మలు తెలిపారు . విషయం తెలుసుకున్న బంధు మిత్రులు ,తల్లి దండ్రులకు అభినందనలు తెలుపుతున్నారు.

Related posts

హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నికలు అక్టోబర్ 30న!

Drukpadam

గోదావరి వరదలపై భద్రాచలంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు…!

Drukpadam

ప్రారంభానికి ముందే కూలిన బ్రిడ్జి.. రూ. 13 కోట్లు వృథా!

Drukpadam

Leave a Comment