Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ నయా జాగీర్ లా వ్యవహరిస్తున్నారు …ప్రియాంక మండిపాటు…

కేసీఆర్ నయా జాగీర్ లా వ్యవహరిస్తున్నారు …ప్రియాంక మండిపాటు…
-సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది ఒక కుటుంబంకోసం కాదు …తెలంగాణ ప్రజల కోసం
-యువత ,నిరుద్యోగులకు హైద్రాబాద్ డిక్లరేషన్
-2 లక్షల ఉద్యోగాలు భర్తీ …నిరుద్యోగులకు 4 వేల భృతి
-అమరులైన ఉద్యమకారుల తల్లిదండ్రులకు నెలకు 25 వేలు
-తెలంగాణ బిడ్డలా కలలు నెరవేర్చకుండా తన సొంత కలలు నెరవేర్చుకుంటున్నారు
-నీళ్లు , నిధులు , నియామకాలు జరగలేదు
-రైతులకు రుణమాఫీ జరగలేదు …9 కేసీఆర్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు .

అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ బిడ్డల కలలు కల్లలు చేస్తూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నయా జాగీర్ లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక మండి పడ్డారు . వేలు ,లక్షలమంది తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు . కానీ వారి ఆశయాలు నెరవేరాయా ..?ఉద్యోగాలు వచ్చాయా…? నిరుద్యోగ భృతి ఇస్తున్నారా …? అన్ని సభికులను ప్రశ్నించారు . లేదు …లేదు అంటూ సభికుల నుంచి సమాదానాలు రాబట్టారు … తెలంగాణ యువత ఆత్మబలిదానాలు చూసి సోనియా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు . ఇక్కడ జరుగుతున్న ఆందోళనలపై ఆవేదన చెందారు . ఇక్కడ ప్రజల కోరికమేరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగింది. స్వారాష్ట్రంలో ఎవరికీ ఉద్యోగాలు వచ్చాయంటే ఒక కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్రం ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా సొంత జాగీర్ లా పాలన సాగిస్తానంటే కుదరదని హెచ్చరించారు . నాడు మన నీళ్లు ,మన నిధులు , మన నియామకాలు అన్న నినాదంతో ఉవ్వెత్తున లేచిన ఉద్యమ స్ఫూర్తిని పక్కన పెట్టిన కేసీఆర్ వైఖరిని దుయ్యబట్టారు . ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు . అందుకోసం ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. తెలంగాణ లో ప్రజల కోరికలు నెరవేరాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమనే అభిప్రాయానికి వచ్చారని అది ప్రజల్లో కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు . ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు ఒక పక్క నిరుద్యోగం , మరోపక్క రైతుల ఆత్మహత్యలు ఆగటంలేదు . నీళ్లు , నిధులు , నియామకాలు లేవు … ఉద్యోగాలు వారికే ప్రజలకు కాదు అనే పరిస్థితి ఏర్పడింది. బీఆర్ యస్ సర్కార్ చేసిన వాగ్దానాలు నెరవేరకపోవడంపై యువత ,విద్యార్థులు ,రైతులు , కార్మికులు ,ఇతర వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయాన్నీ ఆమె గుర్తు చేశారు . రైతులకు రుణమాఫీ లేదు . నిరుద్యోగ భృతి లేదు …రోజుకు 3 గ్గురు
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు . గత 9 సంవత్సరాల్లో 8 వేల మంది రైతులు చనిపోయారు . ఉద్యోగ ఖాళీలు 2 లక్షలు ఉన్నాయి వాటిని నింపలేదు . నిరుద్యోగులకు చేసిన వాగ్దానాలు అమలుకు నోచుకోవడంలేదు .ఫలితంగా వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు . 30 లక్షల మంది నిరుద్యోగులు ఆశగా ఉన్న టి ఎస్ పీఎస్ పేపర్ లీకు అయింది. దానిపై చర్యలు కంటితుడుపుగా ఉన్నాయని ఆమె విమర్శలు గుప్పించారు . 15 లక్షల విద్యార్థులకు పీజు రియంబర్స్ మెంట్ లేదు … పిల్లలలకు స్కూల్స్ కూడా సరిగా లేవు … ధనిక రాష్ట్రమంటున్నారు మరి నిధులు ఎక్కడకి పోయాయని ఆమె ప్రశ్నించారు . ఈ రాష్ట్రం మీది ….అనేక మంది బలిదానాల ఫలితంగా ఏర్పడింది. దాన్ని కాపాడుకోవాల్సిన భాద్యత మీదే …దేశం కోసం మా కుటంబం కూడా అనేక త్యాగాలు చేసిందంటూ ఇందిరమ్మ , రాజీవ్ గాంధీ బలిదానాలకు గుర్తు చేశారు .

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా కృషి మరవలేనిది …

రాష్ట్ర ఏర్పడటానికి సోనియా ఎన్నో ఆలోచలను చేశారు . పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారు. రాష్ట్రంలో ప్రజల పోరాటాలు ,యువకుల ,విద్యార్థులు ఉద్యమాలు ఆమెను కదిలించాయి. అందుకే రాజకీయాలు పార్టీ కోసం కాకుండా తెలంగాణా ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఎన్ని ఆటంకాలు ఎదురైనా లెక్క చేయక రాష్ట్ర ఏర్పాటు కు అంగీకరించారని అన్నారు . తెలంగాణ మీకు నెల కాదు తల్లి లాంటిది ఈ తల్లిని కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు .

నిరుద్యోగ యువతకు హైద్రాబాద్ డిక్లరేషన్ …

హైద్రాబాద్ సరూర్ గ్రౌండ్ లో జరిగిన నిరుద్యోగ నిరసనసభలో నిరుద్యోగ డిక్లరేషన్ చేసింది . అమర వీరుల కుటుంబాలకు ఉద్యోగాలు …తల్లిదండ్రులకు 25 పెన్షన్ , 2 లక్షల ఉద్యోగాలు …బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ , జాబ్ క్యాలండర్ … 4 వేల భృతి , కార్యాలయాలు , సిల్క్ డవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు , ఎస్సీ , ఎస్టీ ,బీసీ లకు …యూనివర్సిటీలు .. డిగ్రీ చదుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామన్నారు . మెదక్ , ఖమ్మం , ఆదిలాబాద్ లలో యూనివర్సిటీల ఏర్పాటు చేస్తామన్నారు . యూత్ కమిషన్ ఏర్పాటు ,పారదర్శికంగా ఉద్యోగ నియామకాలు , ఉద్యమకాలంలో పెట్టిన కేసులు ఎత్తి వేత లాంటి వాగ్దానాలు చేసినట్లు చెప్పారు .అంతకు ముందు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి , రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యరావు ఠాక్రే , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లు ప్రసంగించారు. సభలో మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , వి హనుమంతరావు , పొన్నాల లక్ష్మయ్య , జీవన్ రెడ్డి , జగ్గారెడ్డి , సంపత్ కుమార్ , మాల్ రెడ్డి రంగారెడ్డి , ఎమ్మెల్యే సీతక్క , కొండా సురేఖ , రేణుక చౌదరి తదితరులు హాజరైయ్యారు . . సభకు భారీ సంఖ్యలో ప్రజలు ప్రత్యేకంగా యువత తరలి వచ్చారు …

Related posts

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మరోసారి ఎన్నిక!

Drukpadam

మోదీకి అచ్చే దిన్ పూర్తయ్యాయి: శత్రుఘ్న సిన్హా..

Drukpadam

మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే.. ఏపీ, తెలంగాణలో మహిళలకు దక్కే సీట్లు ఎన్నంటే..!

Ram Narayana

Leave a Comment