Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రియాంక సరూర్ నగర్ నిరుద్యోగ సంఘర్షణ సభ సక్సెస్ …కాంగ్రెస్ లో జోష్ … భారీగా హాజరైన యువత …

ప్రియాంక సరూర్ నగర్ నిరుద్యోగ సంఘర్షణ సభ సక్సెస్ …కాంగ్రెస్ లో జోష్ …
భారీగా హాజరైన యువత …
-సూటిగా సుత్తిలేకుండా ప్రియాంక ప్రసంగం …
-నిరుద్యోగ డిక్లరేషన్ లో యువతకు హామీ
-ఉద్యమకారుల కుటుంబాలకు భరోసా
-కేసీఆర్ కుటుంబపాలనపై నిప్పులు చెరిగిన నేతలు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వరంలో హైద్రాబాద్ సరూర్ నగర్ లో నిర్వహించిన నిరుద్యోగ సంఘర్షణ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్న ఈసభకు భారీగా యువత హాజరై ఆమె సందేశాన్ని ఆసక్తిగా విన్నారు . ఆమె తెలుగులో కూడా కొన్ని మాటలు మాట్లాడి సభికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు . తనను తన నానమ్మ ఇందిరా గాంధీతో పోల్చడాన్ని విని ఆనందిస్తున్నాని పేర్కొన్నారు .తన కుటంబం దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేశారు . తెలంగాణ ఇచ్చేందుకు తన తల్లి సోనియా తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజల ఆకాంక్ష… ఇది ఒక కుటుంబం కోసం కాదని కేసీఆర్ కుటుంబ పాలనపై చురకలు అంటించారు . ఆమె ప్రసంగంలో ఎక్కడ సోది చెప్పలేదు …సూటిగా సుత్తిలేకుండా ప్రసంగం చేయడం సభికులను ఆకట్టుకుంది. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి చేసిన యూత్ డిక్లరేషన్ ను ప్రియాంక ఆమోదం తెలిపారు . తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి ఏఐసీసీ వెన్నుదన్నుగా ఉంటుందని ప్రియాంక భరోసా ఇచ్చారు . .

ప్రియాంక స్టేజి మీదకు రాగానే సభికుల నినాదాలతో సభ ప్రాంగణం మారుమ్రోగింది .సభికులకు అభివాదం చేసిన తర్వాత ఆమె వేదికపై ఉన్ననేతలను పేరుపేరునా పలకరించారు . ప్రసంగం పూర్తీ అయిన తర్వాత సభికుల దగ్గరకు వెళ్లి ఒక వ్యక్తి అందించిన వినతిని స్వయంగా తీసుకున్నారు . సభ సందర్భంగా వచ్చిన వాహనాలతో ఎల్బీ నగర్ , సరూర్ నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది. దీంతో ప్రియాంక కాన్వాయ్ వెళ్లేందుకు సైతం ఇబ్బంది పడాల్సి వచ్చింది . పోలీసులు దగ్గరుండి ట్రాఫిక్ క్లియర్ చేశారు . ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రియాంక తిరిగి సభ అయిన వెంటనే బేగంపేట విమాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లి పోయారు .

రంగారెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షడు నర్సిరెడ్డి సభకు అధ్యక్షత వహించగా పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి తోపాటు , రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యరావు ఠాక్రే , కొండా సురేఖలు మాత్రమే ప్రసంగించారు . సమన్వయకర్తగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ వ్యవహరించారు .

ఇందిరమ్మ రాజ్యం స్థాపనే లక్ష్యంగా ముందుకు సాగాలి …

సభలో ప్రసంగించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యస్థాపనే లక్ష్యంగా మనమందరం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు . నీళ్లు ,నియకకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు . తెలంగాణ సంపదను దోచుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు . తాను నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో వచ్చిన అనుభవాలను వివరించారు . ప్రజలు తనకు చెప్పుకున్న బాధలను తెలిపారు . పోచంపల్లి నేత కార్మికులు ప్రియాంక కోసం ఇచ్చిన చీరలను వేదికపై ప్రియాంక కు అందించారు . వాటి గొప్పతనాన్ని వివరించారు .

మాకొలువులు మాకే కావాలని….రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ     మాకొలువులు మాకే కావాలని , మా నిధులు మాకే , మా నీళ్లు మాకే అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దొరల చేతిలో బందీ అయిందని దాన్ని విముక్తి చేయాలనీ పిలుపు నిచ్చారు . నాడు అనేక మంది యువకులు ,విద్యార్థులు , లాఠీ దెబ్బలాలు లెక్క చేయక, ఆత్మబలిదానాలు ఫలితంగానే తెలంగాణ వచ్చిందని విషయాన్నీ మరవద్దని అన్నారు . తెలంగాణ రాష్ట్ర ఏర్పడే నాటికీ ఉన్నా 2 లక్షల 50 వేల ఉద్యోగాలు 2020 లో బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం లక్ష 91 వేల 126 ఉన్నాయని లెక్క తేల్చారని అయికూడా భర్తీ కాలేదని కేసీఆర్ ను దించితేగాని అవి భర్తీ కావన్న విషయం తేలిపోయిందని అన్నారు .

 

Related posts

రోహిత్ రెడ్డి సహా నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో భద్రత!

Drukpadam

మోదీకి నితీశ్ పాదాభివంద‌నం!.. తప్పేముంద‌న్న జేడీయూ!

Drukpadam

ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు నడుం బిగించిన కేసీఆర్!

Drukpadam

Leave a Comment