Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రతిపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉగ్రరూపం … రేవంత్ పై పరోక్ష విమర్శలు …

వాడి పర్సనాలిటీ ఎంత… వాడెంత?: మంత్రి తలసాని ఉగ్రరూపం

  • విపక్ష నేతలపై ఓ రేంజిలో విరుచుకుపడిన తలసాని
  • నా కొడుకులు అంటూ ఆగ్రహం
  • రేవంత్ పై పరోక్ష వ్యాఖ్యలు
  •  గట్టిగా పిసికితే ప్రాణం పోతుంది… నా కొడుకు అంటూ నిప్పులు చెరిగిన తలసాని

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు ఇప్పటికీ బీఆర్ఎస్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రతిపక్ష నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మునుపెన్నడూ చూడని తలసానిని చూపించారు.

“సెక్రటేరియట్ అనేది ఈ రాష్ట్ర పౌరులదరికీ సంబంధించిన విషయం. ఈ రాష్ట్రంలోని ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించాలంటే సచివాలయమే కేంద్రస్థానం. పాత సెక్రటేరియట్ స్థానంలో కొత్తది నిర్మిస్తామంటే ఆ రోజు ఎన్ని గొడవలు చేశారో అందరికీ తెలుసు. కోర్టులను కూడా ఆశ్రయించారు. ఈ రోజు నా కొడుకులు అందులోకి (సచివాలయంలోకి) మేం కూడా వస్తాం అంటారు” అని నిప్పులు చెరిగారు.

ఇది అద్భుతమైన సెక్రటేరియట్ అని, చూస్తే అమెరికాలోని వైట్ హౌస్ చూడాలి, లేకపోతే తెలంగాణలో మన సచివాలయాన్ని చూడాలి అని తలసాని అభివర్ణించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నామని, సచివాలయానికి కూడా ఆయన పేరు పెట్టుకున్నామని తెలిపారు. ఇటీవల కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారని పేర్కొన్నారు.

తలసాని ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ పై కూడా తలసాని పరోక్షంగా మండిపడ్డారు. పిసికితే ప్రాణం పోతుంది… నా కొడుకు… అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“నిన్న ఆమె (ప్రియాంక) వచ్చింది. ఆమె ఒక డిక్లరేషన్ ఇచ్చింది. ఆ పొట్టి వాడు డిక్లరేషన్ గురించి మాట్లాడతాడు. వాడి నోటికి అడ్డు అదుపు లేదు. ఎమ్మెల్యే లేదు మంత్రి లేదు… వాడు అందరి గురించి వాడు వీడు అని మాట్లాడతాడు. ఇంత లేడు… వాడి పర్సనాలిటీ ఎంత… వాడెంత? పిసికితే ప్రాణం పోతుంది… నా కొడుకు… వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు” అంటూ తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు.

Related posts

రాజకీయాల్లో అసహజం అంటూ ఏమీ ఉండదు: సంజయ్ రౌత్!

Drukpadam

ఏపీ పోలీసులపై చంద్రబాబు ధ్వజం ….గవర్నర్ కు లేఖ…

Drukpadam

హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఖమ్మంలో ఘన స్వాగతం!

Drukpadam

Leave a Comment