Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ లో కింగ్ మేకర్ పాత్ర పోషించేందుకు సొంత పార్టీ ఆలోచనలో పొంగులేటి ఉన్నట్లు ప్రచారం….

తెలంగాణ లో కింగ్ మేకర్ పాత్ర పోషించేందుకు సొంత పార్టీ ఆలోచనలో పొంగులేటి ఉన్నట్లు ప్రచారం….
-ఇప్పటికే కొన్ని జిల్లాలో ఉన్న అసంతృప్త నేతలతో చర్చలు
-బీజేపీ ,కాంగ్రెస్ లో చేరేందుకు వెనకడుగు …
-ఫలప్రదం కానీ ఈటెల అండ్ టీంతో పొంగులేటితో జరిగిన చర్చలు
-కేసీఆర్ ను ఓడించే లక్ష్యం కోసం మళ్ళీ కలవాలని నిర్ణయం
-కేసీఆర్ అవినీతిపరుడని ,కవిత లిక్కర్ స్కాం లో ఉందని నిత్యం చెపుతున్న -బీజేపీ ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటిని ప్రశ్న …
-బీజేపీ తెలంగాణాలో అధికారం కోసం రోడ్ మ్యాప్ ఏమిటి …
-సంతృప్తిగా లేని బీజేపీ నేతల సమాధానాలు

తెలంగాణలో కింగ్ మేకర్ పాత్ర పోషించేందుకు సొంతపార్టీ ఆలోచలలో పొంగులేటి ,జూపల్లిలు ఉన్నారా …? అంటే కొట్టిపారేయలేమని అంటున్నారు విశ్లేషకులు …అందులో భాగంగానే జిల్లాల్లో ఉన్న బలమైన వివిధ పార్టీల అసమ్మతి నేతలతో చర్చలు జరుపుతున్నారని సమాచారం…బీజేపీ కాంగ్రెస్ కు దూరంగా ఉండటం ద్వారా బీఆర్ యస్ ను అధికారంలోకి రాకుండా చేసే పార్టీకి సహకరించాలని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం . రాష్ట్రంలో 25 నుంచి 35 సీట్లలో పోటీచేయడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహించాలని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల బీజేపీ లో చేరమని ఈటెల అండ్ టీం ఖమ్మం వచ్చి జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదు .బీఆర్ యస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని అందుకోసం మళ్ళీ కలిసి చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు .

పొంగులేటిని బీజేపీలో చేరాలని కేంద్ర నేతలు అమిత్ షా , జెపి నడ్డా సూచనలమేరకు ఖమ్మం వచ్చిన బీజేపీ నేతలకు ,పొంగులేటి ,మాజీమంత్రి జూపల్లి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తుంది .ఐదు గంటలు పైగా పొంగులేటి నివాసంలో గడిపిన ఈటెల అండ్ టీం చర్చలు అసంతృప్తిగానే మిగిలాయి. ఇరువురు బీఆర్ యస్ అధికారంలోకి రాకుండా చూడాలని ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ వెళ్లే దారి ఎలా ఉండాలనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయని అంటున్నారు . బీజేపీ నేతలు నిత్యం బీఆర్ యస్ పై అధినేత కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నప్పటికీ చర్యలు లేకపోవడం ప్రజల్లో చర్చనీయాంశంగా ఉందని దీనిపై బీజేపీ వైఖరి ఏమిటని పొంగులేటి , జూపల్లిలు వచ్చిన నేతలను అడిగినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ విషయంలోనూ అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దానిపై బీజేపీ నేతల నుంచి సరైన సమాధానం లేక నీళ్లు నమిలినట్లు చెప్పుకుంటున్నారు . పొంగులేటి కూడా వారిని అయిష్టంగానే వారు వస్తామంటే రమ్మని కలిసేందుకు అంగీకరించినట్లు వినికిడి . బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న మాజీమంత్రి హుజారాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ , మరో ఎమ్మెల్యే రఘునందన్ రావు , మాజీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు రవీందర్ రెడ్డి , మహేష్ రెడ్డి లు ఖమ్మం వచ్చారు . వారు సుదీర్ఘంగా ప్రత్యేక చర్చలు జరిపారు . దేశ ,రాష్ట్ర రాజకీయాలపై పిచ్చాపాటి మాట్లాడారు తప్ప స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు .

ఈటెల చాల సార్లు పొంగులేటికి ఫోన్ చేసి ఖమ్మం మీ ఇంటికి వస్తామని అడిగారని అందువల్లనే వారిని రమ్మని చెప్పారని సమాచారం … వచ్చిన నేతలు పొంగులేటి ,జూపల్లిని బీజేపీలో చేరమని ఆహ్వానించారు . అందుకు వారు ఒకే అనిగాని నో అనిగాని చెప్పలేదని విశ్వసనీయ సమాచారం . అయితే బీఆర్ యస్ గద్దె దించేందుకు కలిసి పనిచేయాలని అనుకున్నారని ఈ ఒక్క సమావేశంలోనే ఏది ఫైనల్ కాదని మారి కొన్ని సార్లు సమావేశం అవుదామని అనుకోని వెళ్లినట్లు సమాచారం …

ఇది ఇలా ఉండగా పొంగులేటి ఇంట్లో సమావేశం జరుగుతుండగా బయట వేచి ఉన్న ఆయన అనుయాయులు , అభిమానులు బీజేపీ నాయకులతో సమావేశం జరపడంపై తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించడం గమనార్హం… బీజేపీతో వెళ్లినా లేక దానికి దగ్గరైన జిల్లా రాజకీయాల్లో నష్టం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు . దానిపై పొంగులేటి ఇంకా సమాలోచనలు జరుపుతున్నారు . గత రెండు మూడు రోజులుగా ఆయన టీఆర్ యస్ పేరుతో పార్టీ పెడుతున్నారని దాన్ని జూన్ 2 న అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు . అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కు దూరంగా ఉండాలని 25 నుంచి 35 సీట్లలో అభర్ధులను పెట్టడం ద్వారా కింగ్ మేకర్ పాత్ర పోషించాలనే ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది . మొత్తానికి పొంగులేటి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు ..చూద్దాం ఏమి జరుగుతుందో …..

 

Related posts

బెంగాల్‌లో బీజేపీకి ఎదురు దెబ్బ.. పార్టీ వీడిన మరో ఎమ్మెల్యే!

Drukpadam

జగన్ ప్రభుత్వంపై సొంతపార్టీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తి …

Drukpadam

రాజ్యసభ సీటుపై సంకేతాలు ఇవ్వలేదు: అలీ

Drukpadam

Leave a Comment