పాలేరు పై ఎర్రజెండా ఎగరటం ఖాయం ….తమ్మినేని
-అనేక ఉద్యమాలకు కేంద్రం పాలేరు నియోజకవర్గం
-సమస్యల పరిష్కరానికి జూన్,జూలై నెలలో సమరశీల పోరాటాలు
-పంచాయితీ కార్యదర్శుల, గ్రామదీపికల పోరాటానికి సిపిఎం మద్దతు
-అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన నిర్వహించాలి
-బిజెపి చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి
-రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్ చొరవ చూపాలి
పాలేరు నియోజకవర్గంలో సిపిఎం పోటిఖాయం …ఎర్రజెండా ఎగరటం ఖాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విశ్వాసం వ్యక్తం చేశారు .బుధవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికలు ఎత్తులు పొత్తులు, దేశ ,రాష్ట్ర రాజకీయాలపై ఆయన ప్రసంగించారు . అనేక ఉద్యమాలకు నిలయమైన పాలేరు నియోజకవర్గంలో సిపిఎం సత్తా చాటాలని పిలుపు నిచ్చారు . రాష్ట్రలో ఉన్న సమస్యలు స్థానిక సమస్యలపై ప్రజల పక్షాన సమరశీల పోరాటాలు నిర్వహించాలని అన్నారు . పంచాయతీ కార్యదర్శులు , గ్రామదీపికల పోరాటానికి సిపిఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు .
స్థానిక సమస్యల పరిష్కారం కోసం రానున్న జూన్ జూలై నెలలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు, ఈ ఆందోళన పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు..స్థానిక ఖమ్మం సుందరయ్య భవనంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బుగ్గ వీటి సరళ అధ్యక్షులు జరిగిన పాలేరు నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తమ్మినేని మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న స్థానిక సమస్యలపై జూన్ జూలై నెలలో మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించినట్టు, ఈ ఆందోళన పోరాటాలకు ప్రజలు కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా
పాలేరు నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని, ప్రతి మండలంలో మినీ స్టేడియంలు ఏర్పాటు చేయాలని,ప్రతి మండల కేంద్రంలో వ్యవసాయ గోడౌన్స్ ఏర్పాటు చేయాలని, ఖమ్మం రూరల్ మండలంలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను, ఎస్సీ బాలుర బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయాలని, అర్హులైన వాళ్లందరికీ ఇల్లు స్థలాలు ఇవ్వాలని, డబల్ బెడ్రూమ్స్ అన్ని గ్రామాలకు మంజూరు చేయాలని,భక్త రామదాసు లింకు కాలువలు తిరుమలయపాలెం మండలంలో అన్ని గ్రామాలకు ఇవ్వాలని తదితర సమస్యలు, ఇంకా స్థానిక సమస్యల పైన ఆందోళనలో పోరాటాలు చేయునట్లు ఆయన తెలియజేశారు.
గ్రామ దీపికలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం శ్రేణులు మద్దతు తెలియజేయాలని, అన్ని మండల కేంద్రాల్లో వారికి మద్దతుగా ఆందోళన నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
బిజెపి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తుందని ఇలాంటి తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టే విధంగా కార్యకర్తలు సిద్ధం కావాలని, ప్రజలకు నిజాలు తెలిపేందుకు కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు .
ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ రానున్న కాలం పోరాటాల కాలమని జిల్లావ్యాప్తంగా అన్ని సమస్యల పైన పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఒక మినీ పరిశ్రమను ప్రారంభించాలని ఇంకా ఇంట్లో ఇళ్ల స్థలాలు డబల్ బెడ్రూమ్స్, తదితర సమస్యల పైన జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఆయన తెలియజేశారు. పాలేరు నియోజకవర్గంలో బలమైన పార్టీగా సిపిఎం ఉందని, మిత్రపక్షల ఐక్యతతో పాలేరుని గెలుచుకోవాలని, ఆ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా అన్నారు.
ఈ విస్తృత సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీరుద్దీన్, గురవర్తి నాగేశ్వరరావు, ఊరడి సుదర్శన్ రెడ్డి, మండల కార్యదర్శులు నండ్ర ప్రసాద్, కొమ్ము శ్రీను, కె.వి.రెడ్డి, నాయకులు అంగిరేకుల నరసయ్య, తాళ్లూరు వెంకటేశ్వర్లు, పొన్నెకంటి సంగయ్య, తమ్మినేని వెంకట్రావు, పి.మోహన్ రావు, గన్యా నాయక్, దుగ్గి వెంకటేశ్వర్లు, నందిగామ కృష్ణ, దాసరి మహేందర్, బింగి రమేష్, ఏటుకూరు రామారావు, రచ్చ నరసింహారావు, నాగాటి సురేష్, వీరన్న, నాగేశ్వరరావు, మారుతి కొండల్, పగడి కత్తులు నాగేశ్వరరావు, పిట్టల రవి, రత్తమ్మ తదితరులతో పాటుగా మరో 250 మంది పాల్గొన్నారు………