Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సీఎం ఎవరనేది అధిష్టానానికి కట్టబెట్టిన సీఎల్పీ …ఈనెల 18 మంత్రివర్గ ప్రమాణం …

సీఎం ఎవరనేది అధిష్టానానికి కట్టబెట్టిన సీఎల్పీ …ఈనెల 18 మంత్రివర్గ ప్రమాణం …
-షాంగ్రీ ల హోటల్ లో పూర్తీ కానీ సీఎల్పీ నేత వ్యవహారం
-కర్ణాటక ప్రజలకు అభినందనలు తెలిపిన కాంగ్రెస్ శాసనసభ పక్షం
-అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటామని సీఎల్పీ తీర్మానం …
-కన్నడ ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తామని ప్రతిన
-ప్రజలకు ఇచ్చిన ఐదు వాగ్దానాలపై సీఎం ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి సంతకం …
-డీకే శివకుమార్ , సిద్దరామయ్య లను ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆదేశం
-వారితో సోనియా , మల్లిఖార్జున్ ఖర్గే , రాహుల్ , ప్రియాంక సమావేశం
ఇద్దరిలో ఒకరికే సీఎం అవకాశం …

కర్ణాటకలో ఈనెల 18 న కాంగ్రెస్ పార్టీ ఆధ్వరంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ,అదే రోజు సీఎంతో పాటు మంత్రివర్గం కూడా ప్రమాణం స్వీకరిస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ నుంచి సోనియా గాంధీ , రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ రానున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి…

బెంగుళూరు లోని షాంగ్రీల హోటల్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో అధిష్టానం నుంచి వచ్చిన దూతలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలూ స్వీకరించారు . వారి అభిప్రాయాలను అధిష్టానానికి అందజేయనున్నట్లు ఏఐసీసీ నుంచి వచ్చిన ఇంచార్జి రణదీప్ సూర్జేవాలా తెలిపారు . కాంగ్రెస్ పార్టీని గెలిపించిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని డీకే శివకుమార్ ప్రవేశపెట్టారని అన్నారు .దాన్ని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరు బలపరిచారని పేర్కొన్నారు .సీఎల్పీ నేత ఎంపిక ను ఏఐసీసీ అధ్యక్షుడికి అప్పగిస్తూ మరో తీర్మానం చేశారు . సోనియా ,రాహుల్ ,ప్రియాంక లకు ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానం చేశారు . ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్లుగా ఐదు అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు అయినా వెంటనే సీఎం మొదటి సంతకం చేస్తారని తెలిపారు . కర్ణాటక లోని ఐదున్నర కోట్లమందికి తమ ప్రభుత్వం జవాబుదారిగా ఉంటుందని తెలిపారు .

సీఎల్పీ నేత ఎంపిక కోసం ఢిల్లీకి చేరింది. ఆదివారం బెంగుళూరులో సమావేశమైన ఎమ్మెల్యేలు నేత ఎంపికను ఏఐసీసీ అధ్యక్షుడికి అప్పగిస్తూ ఒక తీర్మానం చేశారు . దీంతో సిద్దరామయ్య ,డీకే శివకుమార్ ఇద్దరినీ ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది. ఇద్దరిలో రెండు ,మూడు సంవత్సరాలు అనేది కాకుండా పూర్తీ ఐదు సంవత్సరాలు ఒక్కరే సీఎం అవుతారని అంటున్నారు .

Related posts

టీడీపీ పై విజయవాడ ఎంపీ కేశినేని తిరుగుబాటు … చంద్రబాబు ఫోటో తొలగింపు!

Drukpadam

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి: షర్మిల

Drukpadam

కేసీఆర్‌కు మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఫోన్…ముంబైకి రండి.. చ‌ర్చిద్దాం..

Drukpadam

Leave a Comment