Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీకి క్యాబినేట్ ఆమోదం…టియుడబ్ల్యూజె (ఐజెయు) హర్షం…

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీకి క్యాబినేట్ ఆమోదం

మాట నిలుపుకున్న మంత్రి పువ్వాడ

టియుడబ్ల్యూజె (ఐజెయు) హర్షం

దశాబ్దాలుగా జర్నలిజాన్ని వృత్తి గా స్వీకరించి , సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు సొంత ఇంటి స్థలాల సమస్య ఓ కలగా మిగిలిపోయింది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ ఆమోదంతో ఖమ్మం నగర శివారు గోపాలపురం వద్ద స్థలం కేటయించినప్పటికీ ఆయన మరణాంతరం ఆ అంశం అక్కడితో ముగిసింది. నేటి వరకు జిల్లా కేంద్ర జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ డైలీ టీవీ సీరియల్ ఎపిసోడ్ ల కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారాయి. మంత్రులు మారారు. కానీ జర్నలిస్టుల తలరాతలు మాత్రం మారలేదు. ఇన్నేళ్ల సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత ఖమ్మం డైనమిక్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జర్నలిస్టుల కలను నెరవేర్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను మెప్పించి, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఒప్పించి, క్యాబినెట్ ఆమోదం తెప్పించారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ఒప్పించడంలో పువ్వాడ కు చేదోడు వాదోడుగా మంత్రి కేటీఆర్ , హరీష్ రావు పని చేశారు. ఖమ్మం సభలో ఇన్చార్జిగా పని చేసిన మంత్రి హరీష్ రావు నాడు కేసీఆర్ ఖమ్మంలో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కృషి చేస్తానని జర్నలిస్టులకు మాట ఇచ్చారు. ఆ మాటను మంత్రి పువ్వాడ, మంత్రి హరీష్ రావు నెరవేర్చడంతో ఖమ్మం జిల్లా జర్నలిస్టులోకం హర్షం వ్యక్తం చేస్తుంది. గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఖమ్మం నగర శివారు గోపాలపురం వద్ద ఇరిగేషన్ శాఖకు చెందిన 23 ఎకరాల స్థలాన్ని జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసిఆర్ హామీ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి మేరకు ఈ స్థలాల కేటాయింపు జరిగిందని టియుడబ్ల్యూజె (ఐజెయు) జిల్లా కమిటీ తెలిపింది. సుదీర్ఘకాలంగా ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న ఖమ్మం జర్నలిస్టులకు అండగా నిలబడి ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా మంత్రి అజయ్ కుమార్ పట్టువదలని విక్రమార్కునిలా జర్నలిస్టులకు స్థలాల కేటాయింపు కోసం కృషి చేశారని ఐజెయు జిల్లా కమిటీ తెలిపింది. వీలైనంత త్వరలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలను అందజేయాలని కోరుతూ విశేష కృషి చేసిన మంత్రి అజయ్ కుమార్ కు, ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి టియుడబ్ల్యూజె (ఐజెయు) కృతజ్ఞతలు తెలిపింది. కృతజ్ఞతలు తెలిపిన వారిలో టియుడబ్ల్యూజె (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, నగర అధ్యక్ష, కార్యదర్శులు మైసా పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్, ఖమ్మం ప్రెస్ క్లబ్ కా ర్యదర్శి కురాకుల గోపి, కోశాధికారి నామా పురుషోత్తం, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆలస్యం అప్పారావు, జాకీర్, ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నారు.

Related posts

సంక్రాంతి ఎఫెక్ట్.. హైదరాబాద్-విజయవాడ రహదారిపై ఒక్క రోజే 67వేలకు పైగా వాహనాల పరుగులు!

Drukpadam

పార్లమెంట్ కొత్త భవనం.. ఎన్నో ప్రత్యేకతల నిలయం

Drukpadam

టీఆర్ యస్ యువజన విభాగాన్ని బలోపేతం చేస్తాం :కృష్ణ చైతన్య

Drukpadam

Leave a Comment