Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి అడుగులు దాదాపు కాంగ్రెస్ వైపే …?

పొంగులేటి అడుగులు దాదాపు కాంగ్రెస్ వైపే …?
-పొంగులేటి ఖమ్మం ఆత్మీయ సమ్మేళనానికి కోదండరాం స్పెషల్ అట్రాక్షన్
-పొంగులేటి ఖమ్మం లో ఆఖరి ఆత్మీయ సమ్మేళనం …
-భారీ జనసమీకరణకు ప్లాన్ …ఖమ్మం పై పొంగులేటి గురి
-ఖమ్మంలోని పొంగులేటి పోటీ చేస్తారంటూ ప్రచారం …

మాజీ ఎంపీ పొంగులేటి అడుగులు ఎటువైపు అనే దానికి దాదాపు సమాధానం దొరికినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు …అయితే ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టమైన హామీ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం …రేపటి ఖమ్మం ఆత్మీయ సమ్మేళనానికి తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫసర్ కోదండరాం రావడం చర్చనీయాంశంగా మారింది. ఒకటిమాత్రం క్లారిటీ వచ్చిందని అంటున్నారు పరిశీలకులు ఆయన బీజేపీలోకి వెళ్లడంలేదని నిర్దారణకు వచ్చారు .

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలంగా మారిన పొంగులేటి కోసం అటు బీజేపీ ,ఇటు కాంగ్రెస్ , వైయస్ ఆర్ తెలంగాణ పార్టీ ,చివరకు టీడీపీ లు గట్టిగ ప్రయత్నం చేశాయి..కానీ అయన ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఎన్ని విమర్శలు చేసిన ఏపార్టీలో చేరతారనేదానిపై సస్పెన్స్ కొనసాగించారు . చివరకు అనేక మంది ఆయన ఎటు చేరబోతున్నారని ఆరా తీయడం సైతం ఆపేశారు. ఇప్పడు ఆయన లైన్ క్లియర్ అయినట్లు సమాచారం …తెలంగాణ లో కేసీఆర్ ను బీజేపీ ఓడించలేదనే నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తుంది. కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణ బీజేపీలో ఉన్న విభేదాలు బయటకు వస్తున్నాయని అంటున్నారు. కొందరు అందులో చేరిన నేతలు సైతం బీజేపీ వైఖరిపైనా తీవ్ర అసంతృప్తి తో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది . నిన్నమొన్నటివరకు బీజేపీ తెలంగాణ లో అధికారంలోకి వస్తుందని తొడగొట్టిన నేతలు స్వరాల్లో మార్పు కనిపిస్తుంది. రోజురోజుకు కాంగ్రెస్ పెరుగుతుండగా , బీజేపీ గ్రాఫ్ ఉన్నదాన్ని నిలబెట్టుకోకపోగా పడిపోతుందని అంటున్నారు .తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే 60 సీట్లు గెలవాలి …అది బీజేపీకి సాధ్యమేనా అనే సందేహాలు కలుగు తున్నాయి. పైగా ఎంతసేపటికి మతాలు,ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీగా దానిపై ప్రతిపక్షాలు ,ప్రత్యేకంగా అధికారంలో ఉన్న బీఆర్ యస్ , లెఫ్ట్ పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీఆర్ యస్ అవినీతి ఆరోపణలపై మాట్లాడుతున్న బీజేపీ ఎంతవరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సందేహాలు కలుగుతున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికి 9 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించగా 10 వది చివరిదైన సమ్మేళనం ఆదివారం ఖమ్మంలో జరిపేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు . పొంగులేటి రాజకీయ అడుగులపై ఇంకా సందిగ్ధం ఉన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు . విశ్లేషకులు …ఖమ్మం సమ్మేళనానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తో పాటు తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రొఫసర్ కోదండరాం వస్తున్నట్లు ప్రకటించడంతో ఇది స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. కోదండరాం కు నీతినిజాయతికి నిలువుటద్దంగా మంచి పేరుంది. దానితో ఉద్యమకారులు సైతం ఆలోచనలో పడ్డారు . తెలంగాణ ఉద్యమంలో అన్ని తానై నడిపించిన కోదండరాం పొంగులేటితో జత కట్టడంతో మరోసారి రాజకీయ బుర్రలకు పదును పెట్టినట్లు అయింది. ఇప్పటివరకు బీజేపీలోకి వెళ్ళ్తాడోమే అనే దానికి దాదాపు తెరపడినట్లేనని అంటున్నారు రాజకీయ పండితులు …

Related posts

నాగాలాండ్ లో బీజేపీ కూటమికి ఎన్సీపీ మద్దతు.. పవార్ పై ఒవైసీ తీవ్ర విమర్శలు…

Drukpadam

మోదీ కాన్వాయ్‌ను అడ్డగించింది మేమే.. ఖలిస్థానీ అనుకూల వేర్పాటువాద సంస్థ !

Drukpadam

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రచారం?

Drukpadam

Leave a Comment