Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

193 ఫ్రీ గుర్తులను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం…

193 ఫ్రీ గుర్తులను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం…

  • ఇటీవల వివిధ పార్టీలకు గుర్తులు ఖరారు చేసిన ఈసీ
  • సంబంధిత నోటిఫికేషన్ విడుదల
  • పలు ఫ్రీ గుర్తులతో తాజాగా జాబితా విడుదల

ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం వివిధ పార్టీలకు గుర్తులను ఖరారు చేయడం తెలిసిందే. అదే సమయంలో ఆటో, టోపీ, ట్రక్కు, ఇస్త్రీ పెట్టె వంటి పలు గుర్తులపై నిషేధం విధించింది. ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో, 193 ఫ్రీ గుర్తులను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. గుర్తింపు లేని రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ గుర్తులను ఎంపిక చేసుకుని పోటీ చేయవచ్చు.

ఈ ఏడాది డిసెంబరులో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ ఈ ఫ్రీ గుర్తులను విడుదల చేసినట్టు తెలుస్తోంది.

ఈసీ విడుదల చేసిన గుర్తుల్లో గాజులు, బేబీ వాకర్, వాలెట్, పుచ్చకాయ, వాక్యూం క్లీనర్, ట్రంపెట్, వాకింగ్ స్టిక్, ఏసీ, సూది, ఏసీ, లాగుడు బండి, వయొలిన్, కిటికీ, వాల్ నట్, విజిల్, వూల్ తదితర వస్తువులు ఉన్నాయి.

Related posts

‘ఉచిత తాయిలాల’ కేసు త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్​ చేసిన సీజేఐ ఎన్వీ రమణ…

Drukpadam

Staples Has Discounted The iPad Mini 4 By $100

Drukpadam

ఎగుమతుల్లో దుమ్మురేపి రికార్డ్ సృష్టించిన భారత్.. చరిత్రలో ఇదే అత్యధికం!

Drukpadam

Leave a Comment