కాంగ్రెస్‌కు 70 సీట్లు రాకుంటే రాజీనామా.. ఎంపీ కోమటిరెడ్డి ప్రకటన…
-కార్యకర్తల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకున్న ఎంపీ
-వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 70-80 సీట్లు సాధింస్తుందని వెల్లడి
-కాంగ్రెస్‌కు 70 సీట్లు రాకుంటే రాజీనామా చేస్తానని వ్యాఖ్య
-ప్రజలు తనను నల్గొండ జిల్లా ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ఆశాభావం
ఆంధ్రాలో లగడపాటి రాజగోపాల్ లాగా తెలంగాణాలో కూడా మరో ఆక్టోపస్ బయలుదేరాడు …సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణాలో కాంగ్రెస్ కు 70 సీట్లు రాకపోతే తాను రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు .ఇప్పటికే అతని సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి ఓడిపోయారు . కోమటి రెడ్డి పై కూడా ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ఆయన సమర్ధించుకోవడానికి ఏమి చెప్పిన తరచూ బీజేపీ నాయకులను , ప్రధాని మోడీని ,హోమ్ మంత్రి అమిత్ షా ను ఇతర మంత్రులను కలుస్తూ ఉండటంతో ఆయన కూడా బీజేపీకి వెళుతున్నారని అభిప్రాయాలు కలిగాయి. అయితే కాంగ్రెస్ లో ఆయన కొందరు సీనియర్ నేతలతో మంచి సంబంధాలనే కొనసాగుతున్నారు . దీనిపై కూడా అనేక అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పీఠం అప్పగించడం ఇష్టంలేని కోమటి రెడ్డి అందుకు అనుగుణంగానే పార్టీకి అంటీముట్టనట్లుగా నడుస్తున్నారు.కర్ణాటక ఎన్నికల తర్వాత పార్టీని వీడాలనుకున్న కొందరు నేతలు పునరాలోచలలో పడ్డారు .బీజేపీ తెలంగాణాలో బీఆర్ యస్ ను ఓడిస్తుందని నమ్మిన నేతలు సైతం తమ మనసు మార్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. బీజేపీ నుంచి కూడా కొందరు తిరిగి కాంగ్రెస్ రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ పిలుపు నిచ్చారు .ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి 70 పాట ఎత్తుకోవడం…తన జన్మదిన వేడుకల సందర్భంగా సీఎం ,సీఎం అంటూ నినాదాలు చేసిన తన అనుయాయులను అట్లా అంటే తాను పోటీచేసిన దగ్గర అందరు ఒక్కటై ఓడిస్తారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 70 స్థానాలు రాకపోతే రాజీనామా చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ప్రజలు తనను నల్గొండ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు వద్ద ఎంపీ మంగళవారం పార్టీ కార్యకర్తల సమక్షంలో తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 70-80 సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీలో వర్గపోరు లేదన్న ఆయన, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. ఈ నెల 26న ముఖ్యనాయకులతో రాహుల్ గాంధీ, ఖర్గే సమావేశం అవుతారన్నారు. 10 రోజుల్లో ప్రియాంకతో నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
భట్టితో మంచి సంబంధాలు ఉన్న కోమటిరెడ్డి ఆయన నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు వస్తానని చెప్పి రాకపోవడం భట్టి కూడా ఆయనపట్ల అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది …. ప్రియాంక సభకు కూడా రాకుండా ఆయన విదేశాలకు వెళ్లడంపై కాంగ్రెస్ కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా ఆయన డబుల్ స్టాండర్డ్ వ్యవహారాలు కాకుండా పార్టీకోసం పనిచేస్తే మంచిదని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి…