Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వద్దిరాజు రాజ్యసభకు @ ఏడాది …ఇనగుర్తి నుంచి అత్యన్నతి సభకు..

వద్దిరాజు రాజ్యసభకు @ ఏడాది …ఇనగుర్తి నుంచి అత్యన్నతి సభకు…
-కేసీఆర్ మదిలో స్థానం సంపాదించిన వద్దిరాజు
-కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానని భరోసా
-బీసీల పక్షపాతిగా ముద్ర …
-రాజ్యసభ తిరిగి ఇస్తారా …? ఎమ్మెల్యేగా పోటీచేయిస్తారా ..?

వద్దిరాజు రవిచంద్ర ….ప్రముఖ గ్రానైట్ వ్యాపారి …. రాజకీయాలతో మక్కువ …ప్రజలకు ఎదో చేయాలనే తపన …ముందు కాంగ్రెస్ రాజకీయాలతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వద్దిరాజు బీఆర్ యస్ లో చేరారు . చేరిన కొద్దికాలంలోనే తన మంచితనంతో నమ్మకస్తుడైన వ్యక్తగా మారిపోయాడు …ఖమ్మం జిల్లా బీఆర్ యస్ లో ప్రముఖ నాయకుడిగా కేసీఆర్ ఆయన ప్రాధాన్యత ఇచ్చారు . కేసీఆర్ నమ్మకాన్ని వమ్ముచేయకుండా “రవి అంటే ఒకే సార్” అనడమే తప్ప మరో ఆలోచన లేకుండా ఎదురు సమాధానం చెప్పకుండా తనకు అప్పగించిన పనిని చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. దీంతో కొద్దికాలంలోనే కేసీఆర్ ,కేటీఆర్ దృష్టిలో పడిన వద్దిరాజుకు గత ఏడాది రెండు సంవత్సరాల కాలానికి రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా మున్నూరు కాపు సామాజికవర్గానికి ఒక బీసీ నేతకు సముచిత స్థానం ఇచ్చినట్లు అయింది.

తనకు ఇచ్చిన రాజ్యసభ సీటును పార్టీ నిర్ణయాల మేరకు కేసీఆర్ కేటీఆర్ సూచనల మేరకు పదవికి వన్నెతెచ్చే విధంగా నడుచుకుంటూ శహభాష్ వద్దిరాజు అనిపించుకుంటున్నారు . జిల్లాలో ఉన్న పార్టీ నాయకులతో కలివిడిగా ఉంటూ తనకు సమయం చిక్కినప్పుడల్లా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు . ఖమ్మం నుంచి బీఆర్ యస్ అధినేత కేసీఆర్ ఒకే సమయంలో ఇద్దరికీ రాజ్యసభ ఇచ్చి జిల్లాకు సముచిత ఇచ్చి ప్రాధాన్యత కల్పించారు . జిల్లాలోని పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యమే కాకుండా తనకు పార్టీ అధినేత అప్పగించిన పనిలో నిరంతరం ఉంటూ తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నారు .

ఎక్కడో ఇనగుర్తి అనే కుగ్రామంలో జన్మించిన వద్దిరాజు దేశంలో అత్యన్నత పెద్దల సభగా భావించే పార్లమెంట్ లోని రాజ్యసభ కు వెళ్లడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు . ఎంపీగా ఏడాది పూర్తీ చేసుకున్న సందర్భంగా పలువురు ఆయన హితులు , సన్నిహితులు , వివిధ వర్గాల ప్రముఖులు , జర్నలిస్టులు కలిసి అభినందనలు తెలుపుతున్నారు. నిత్యం చిరునవ్వుతో ఎంతటి కష్టం వచ్చిన వారినైనా పలకరించడం వారి సమస్యలు అడ్రస్ చేయడం సహాయం అందించడంలో మనసున్న మహారాజుగా ఆయనకు పేరుంది . అందుకే రెండేళ్లకే ఉన్న రాజ్యసభను సభ్యత్వాన్ని మరో ఆరేళ్లకోసం పొడిగించేందుకు కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు . అంతే కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయించడంద్వారా బీసీలకు ప్రాధాన్యంతోపాటు తన కోటరీలో నమ్మకస్తుడుగా ఉన్న వద్దిరాజు ను ప్రోత్సహించాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. ….

Related posts

ప్రతిపక్షాలకు తనదైన శైలిలో ప్రధాని మోదీ కౌంటర్​!

Drukpadam

బెంగాల్‌ ప్రచారపర్వంలోకి జయాబచ్చన్…టీఎంసీ కి మద్దతు

Drukpadam

నెపం నాదికాదు…కేసీఆర్, కేటీఆర్ లది …మంత్రి మల్లారెడ్డి!

Drukpadam

Leave a Comment