వాట్సాప్ లో ఫోన్ నంబర్ కనిపించదు.. మీ పేరు వరకే..
- యూజర్ నేమ్ వరకే కనిపించే విధంగా కొత్త సదుపాయం
- ప్రస్తుతం దీన్ని అభివృద్ధి చేస్తున్న వాట్సాప్
- దీనివల్ల యూజర్లకు మరింత గోప్యత
వాట్సాప్ మరో ఆసక్తికరమైన ఫీచర్ ను యూజర్ల కోసం తీసుకురానుంది. యూజర్లు తమ ఫోన్ నంబర్ మరొకరికి కనిపించకుండా చేసుకోవచ్చు. ఫోన్ నంబర్ కు బదులు వారు ఎంపిక చేసుకున్న పేరు (యూజర్ నేమ్) మాత్రమే అవతలి వారికి కనిపిస్తుంది. ఈ విషయాన్ని వాట్సాప్ సమాచారాన్ని ట్రాక్ చేసే వాబీటాఇన్ఫో సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ను అభివృద్ధి చేస్తోంది. అది ఇంకా పరీక్షల దశలోకి రాలేదు. సాధారణంగా టెస్టింగ్ దశలోకి వచ్చిన ఫీచర్లు, యూజర్లకు అప్ డేట్ రూపంలో వస్తాయని కచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నట్టు సమాచారం.
కనుక ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు తెలియవు. ఇప్పటికే కొన్ని ఇతర సామాజిక మాధ్యమ వేదికలు యూజర్ల కోసం ఇలాంటి ఫీచర్ ను అందిస్తున్నాయి. ఫోన్ నంబర్ లేకుండా, కేవలం యూజర్ నేమ్ మాత్రమే అక్కడ డిస్ ప్లే అవుతుంది. యూజర్ నేమ్ ఫీచర్ వాట్సాప్ లో ఎలా పనిచేస్తుందనే దానికి వాబీటాఇన్ఫో ఓ స్క్రీన్ షాట్ ను సైతం షేర్ చేసింది. ఫోన్ నంబర్ కు బదులు యూజర్ నేమ్ పెట్టుకోవడం వల్ల మరో అంచె భద్రత లభించినట్టుగానే భావించొచ్చు. ముఖ్యంగా మహిళలకు ఈ ఫీచర్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది.