Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

అమెరికాలో భర్త వేధింపులకు తట్టుకోలేక హైద్రాబాద్ చేరుకున్న యువతి …పోలీసులకు ఫిర్యాదు

నువ్వు చస్తే రెండో పెళ్లి చేసుకుంటా.. భార్యకు నరకం చూపిస్తున్నభర్త!

  • అదనపు కట్నం కోసం అమెరికాలో మహిళకు వేధింపులు
  • గదిలో బంధించి భోజనం పెట్టకుండా నీళ్లు ఇవ్వకుండా వేధింపులు
  • తప్పించుకుని స్వదేశం చేరుకున్న బాధితురాలు
  • శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు 

చచ్చిపోవాలని నిత్యం నరకం చూపిస్తున్న భర్తపై ఓ మహిళ శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. శంషాబాద్ మండలానికి చెందిన మహిళ (32)తో శంకరపల్లి మండలం మహాలింగపురానికి చెందిన ప్రవీణ్‌రెడ్డికి 2017లో వివాహమైంది. పెళ్లయ్యాక భార్యను తీసుకుని ప్రవీణ్ అమెరికా వెళ్లాడు. వీరికి ఓ బాబు జన్మించాడు. ఈ క్రమంలో కొంతకాలంగా అదనపు కట్నం కోసం ప్రవీణ్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు.

అయినప్పటికీ ఆమె కట్నం ఊసెత్తకపోవడంతో దాడి చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసేవాడు. ఓ గదిలో బంధించి భోజనం పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు. చచ్చిపోవాలని, అప్పుడు రెండో పెళ్లి చేసుకుంటే బోల్డంత కట్నం వస్తుందని చెబుతూ నిత్యం నరకం చూపించేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేని బాధితురాలు ఒక రోజు తప్పించుకుని అతి కష్టం మీద స్వదేశం చేరుకుంది. ఆపై శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

టీడీపీ నేతపై కాల్పుల ఘటన పట్ల జిల్లా ఎస్పీ వివరణ!

Drukpadam

కన్నకొడుకునే దోపిడీ చేయబోయిన తండ్రి!

Drukpadam

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి లో భారీ దొంగతనం!

Drukpadam

Leave a Comment