Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం జర్నలిస్టుల కల సాకారం …ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు …

ఖమ్మం జర్నలిస్టుల కల సాకారం …ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు …
-మంత్రి అజయ్ కు ,జిల్లా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు
-టీయూడబ్ల్యూజే (ఐజేయు)

ఖమ్మంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తానని జనవరి 18 న ఖమ్మంలో జరిగిన బీఆర్ యస్ సభలో ఇచ్చిన హామీమేరకు అన్న మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఖమ్మం జిల్లా టీయూడబ్ల్యూ జె (ఐజేయూ ) కృతజ్ఞతలు తెలిపింది. ఇందుకు నిరంతరం పర్వేక్షించి తన సొంత పనికన్నా మిన్నగా భావించి అహర్నిశలు కృషి చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో సానుకూలంగా స్పందించిన మంత్రి హరిశ్ రావు కు ,కేటీఆర్ కు , జిల్లా కలెక్టర్ పి గౌతంకు ,జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు కు ఆర్డీఓ , అర్బన్ , రఘునాథ పాలెం తహశీల్ దార్లకు కమిటీ ప్రత్యేక ప్రసంశలు తెలిపింది. ఖమ్మం జర్నలిస్టుల 20 ఏళ్ల కలను సహకారం చేసిన రాష్ట్ర రవాణా శాఖ . ఇళ్ల స్థలాల కోసం కృషిచేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జర్నలిస్టుల పట్ల ఉన్న అభిమానం ఆత్మీయతను చాటుకున్నారని, తమ యూనియన్ తో ఎంతో మమకారంగా ఉంటారని, యూనియన్ చేసిన ఎన్నో పోరాటాల ఫలితంగా తమకు ఇచ్చిన మాటను మంత్రి పువ్వాడ నిలబెట్టుకున్నారని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రామనారాయణ, జిల్లా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, ఖమ్మం నగర అధ్యక్ష కార్యదర్శులు మైస పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మనసున్న మహారాజుగా, జర్నలిస్టుల పక్షపాతిగా నిరూపించుకున్నారని పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు జర్నలిస్ట్ యూనియన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేగా ఆనాడు జర్నలిస్టులకు ఇచ్చిన మాటకు కట్టుబడి , మంత్రిగా నేడు మనసుపెట్టి, మాట నిలబెట్టుకుని జర్నలిస్టుల 20 ఏళ్ల నాటి కలను నెరవేరుస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ చరితార్థులుగా అభివర్ణించారు.
తెలంగాణ ఉద్యమ నేత సీఎం కేసీఆర్ ను ఒప్పించి , ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఆవిర్భావ తొలి సభలో .. , ఖమ్మం నూతన కలెక్టరేట్ భవన ప్రారంభ సందర్భంలో.. నలుగురు సీఎంల సమక్షంలో ప్రకటించేట్లు చేశారని అన్నారు. ఖమ్మంలో ఫైలు కదిలించి.. హైదరాబాద్లో ఆమోదింపజేసి.. క్యాబినెట్లో 23 ఎకరాల స్థలాన్ని కేటాయింపచేసి.. జీవో రూపంలో కార్యాచరణ చేసి .. కే సీ ఆర్ ఖమ్మం జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి స్థలం కేటాయింప చేసిన మంత్రి అజయ్ గారికి ఖమ్మం జర్నలిస్టులు ఎంతో రుణపడి ఉంటారని తెలిపారు. ఒకేసారి వందలాది మంది జర్నలిస్టు కుటుంబాలకు భరోసా కల్గించి .. వెలుగులు నింపిన మంత్రి పువ్వాడ అజయ్ కు , వారికి ఆ అవకాశం కలిగించిన సీఎం కేసీఆర్ కు, సహకరించిన మంత్రి హరీష్ రావు కు , జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులందరికీ, ఇందుకు
సహకరించిన రాజకీయ పార్టీలకు , సిసిఎల్ఏ, ఇరిగేషన్ అధికారులకు, ఖమ్మం జిల్లా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులందరికీ టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్ట్ యూనియన్ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు యూనియన్ ఒక ప్రకటనలో పేర్కొన్నది …

Related posts

వైద్య ఆరోగ్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు   పీఆర్సీ అమలు చేయాలి…

Drukpadam

షర్మిల దీక్ష భగ్నం … పోలిసుల తోపులాట , చిరిగిన దుస్తులు ఒంటికి దెబ్బలు కంట కన్నీరు

Drukpadam

అనంతపురంలో భారీ వర్షం .. నీట మునిగిన కాలనీలు…

Ram Narayana

Leave a Comment