Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

బీజేపీ అడ్డదిడ్డ పాలనకు వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యం కావాలి …కేసీఆర్ ,కేజ్రీవాల్ పిలుపు ..

బీజేపీ అడ్డదిడ్డ పాలనకు వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యం కావాలి …కేసీఆర్ ,కేజ్రీవాల్ పిలుపు ..
-దీనికి అడ్డు కట్ట వేయకపోతే దేశానికి ప్రమాదం
-ఢిల్లీ లో సుప్రీం కోర్ట్ తీర్పును పక్కన పెట్టి లెఫ్టనెంట్ గవర్నర్ కు అధికారాలా..! సిగ్గుమాలిన చర్య
-మోడీ సర్కార్ ఎమర్జన్సీ ముందు రోజులు గుర్తుకు తెస్తుంది.
-ప్రజాస్వామ్య బద్దగా ఎన్నికైన ప్రభుత్వాలను అపహాస్యం చేస్తుంది
-విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను మార్చుతుంది

కేంద్రంలో మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల నిర్ణయాన్ని , కోర్ట్ తీర్పులను లెక్క చేయకుండా అడ్డ దిడ్డంగా పాలన చేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం మాన్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు . బీజేపీ చర్యలను వారు తీవ్రంగా ఖండించారు . ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఎన్నికైన ప్రభుత్వాన్నినిరంతరం ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా అధికారులను బదిలీ చేసే అధికారాన్ని లెఫ్టనెంట్ గవర్నర్ కు కట్టబెడుతూ తీసుకున్న నిరయాన్ని గర్హించారు . దీనిపై సుప్రీం కోర్ట్ రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్లగా చీఫ్ జస్టిస్ తో సహా ఐదుగురు జడ్జిలు ఉన్న బెంచ్ 5 -0 తో కేంద్ర చర్యలను తప్పుపట్టింది . దీంతో తన పంతం నెగ్గించుకోవాలని తిరిగి ఆర్డినెన్స్ తీసుకోని రావడంపై కేజ్రీవాల్ ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ను కలిసేందుకు హైద్రాబాద్ వచ్చారు . ఆయన వెంట పంజాబ్ సీఎం మాన్ కూడా వచ్చారు . ముగ్గురు సీఎం లు కేంద్ర చర్యలపై విపక్షాలను ఐక్యం చేయాలనీ చర్చలు జరిపారు . ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడాడు . కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అరాచకాలు ,ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయని ధ్వజమెత్తారు . ఢిల్లీ లో ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వ అధికారాలు కట్ చేసి నియమించిన లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేతుల్లో అధికారాలు పెట్టడం ఏమి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు . మూడు సార్లు ఢిల్లీ ప్రజల ఆశ్వీర్వాదంతో బ్రహ్మాండమైన మెజార్టీ తో ఎన్నికై ప్రజా రంజక పాలన అందిస్తున్న కేజ్రీవాల్ సర్కార్ ను నిర్వీర్యం చేయడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు . ఇది నాటి ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తుందని అన్నారు . ఇప్పైటికైనా ఆర్డినెన్స్ ను వెనక్కు తీసుకోని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు .

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ తీర్పును అమలు చేయకుండా ఢిల్లీ ప్రజలను అవమాన పరుస్తున్నారని ఈ చర్యలను ఖండించకపోతే దేశానికి ప్రమాదమని హెచ్చరించారు . అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీజేపీ అనుకూల ప్రభుత్వాలను ఎన్నుకుంటున్న విషయాలను కేజ్రీవాల్ ప్రస్తావించారు .బీజేపీ వ్యతేరేక ప్రభుత్వాలను పనిచేయనీయడంలేదని అన్నారు .పంజాబ్ సీఎం మాన్ మాట్లాడతూ ఎల్జీ సెలెక్టెడ్ కాగా , ఢిల్లీ గవర్నమెంట్ ఎలెక్టడ్ అని కేంద్ర గుర్తుంచుకోవాలని అన్నారు .

Related posts

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న వారికి శిక్ష తప్పదు: కవితపై ఈటల పరోక్ష వ్యాఖ్యలు!

Drukpadam

మరుగుతున్న నీళ్లు జార విడిచిన ఎయిర్‌హోస్టస్.. ఎయిర్ ఇండియా ప్రయాణికురాలికి గాయాలు

Ram Narayana

హైదరాబాదులో టీడీపీ ఆవిర్భావ సభ… ప్రత్యేక ఆకర్షణగా ఎన్టీఆర్ చైతన్యరథం!

Drukpadam

Leave a Comment