Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఈటెలపై జూపల్లి బాంబ్ …మాది ప్రజల దారి … మావెంట రమ్మని ఈటెలను కోరాం..

  • కేసీఆర్ ను గద్దె దింపడమే తమ ఏకైక లక్ష్యమన్న జూపల్లి
  • తమతో పాటు అందరూ రావాలని విన్నపం
  • వచ్చే నెలలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడి
  • కెసిఆర్దీ మాటల ప్రభుత్వం …నయవంచన ఆయన నైజం
  • ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు , తెలంగాణాలో ఆపార్టీ చేరికల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై మాజీమంత్రి బేర్ యస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు బాంబ్ పేల్చారు .మేము బీజేపీలోకి వెళ్లడంకాదు …ఈటెల నే మావెంట రమ్మని అంటున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు . కేసీఆర్ ను గద్దె దించాలని కోరుకొనే వారిని అందరిని ఐక్యం చేయాలనేదే మా తపన అందుకోసం మా ప్రయత్నాలు చేస్తున్నాం ..అనేక మంది మా అభిప్రాయాలతో ఏకీవబిస్తున్నారు …అందువల్ల కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమైతే పని సులువవుతుంది. ఇప్పటికే ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ ముందుకు సాగాలని మా అభిప్రాయం …ఈటెల తోపాటు మరికొందరు ఉన్నారు .వారిని కూడా కలిశాం మావైఖరిని చెప్పాము. వారి కూడా సానుకూలంగా ఉన్నారు . అయితే మా ప్రయత్నాలు ఎంతవారు సక్సెస్ అవుతాయనేది చూడాలి అని జూపల్లి పేర్కొన్నారు .

బీఆర్ఎస్ బహిష్కృత నేతలైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరబోతున్నారనే అంశంపై తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వారిని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ వారితో పలుమార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే. వారు బీజేపీలో చేరేలా ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. అయినా వారు బీజేపీలో చేరుతామని చెప్పలేదు. దీంతో వారిద్దరూ బీజేపీలో చేరడం కష్టమేనని ఈటల మీడియా ముఖంగా చెప్పారు. వారితో భేటీ అయినప్పుడు తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.

మరోవైపు తాజాగా జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము బీజేపీలోకి వెళ్లడం కాదని, ఈటలనే తమతో పాటు రావాలని కోరామని చెప్పారు. కేసీఆర్ ను గద్దె దించడమే తమ ఏకైక లక్ష్యమని అన్నారు. వచ్చే నెలలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. తమతో పాటు అందరూ కలిసి రావాలని కోరుతున్నామని చెప్పారు.

Related posts

యూపీలోని రాంపూర్ లో రాత్రుళ్లు వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్న స్త్రీ!

Drukpadam

కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్.. అనూహ్యంగా దిశ మార్చుకున్న ‘అసని’!

Drukpadam

బ్రిటన్‌లోని భారతీయ విద్యార్థులకు మరో షాక్…

Drukpadam

Leave a Comment