ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్యే వెంకటవీరయ్యతో కలిసి గోశాలకు పశుగ్రాసం అందజేత…
-అన్నదానం మాదిరిగానే మూగజీవాలకు పశుగ్రాసాన్ని అందించడం పుణ్యకార్యం:ఎంపీ రవిచంద్ర
-ఆవులను మన దేశం పవిత్రంగా చూస్తుంది,పూజిస్తుంది:ఎంపీ రవిచంద్ర
-ఖమ్మం టేకులపల్లిలోని సుప్రసన్న గోశాలకు 150ట్రాక్టర్లతో పశుగ్రాసాన్ని తరలించిన ఎమ్మెల్యే వెంకటవీరయ్య
-ఎమ్మెల్యే వెంకటవీరయ్య వెంట రాగా మండుటెండలో ట్రాక్టర్ నడిపిన ఎంపీ రవిచంద్ర
-టేకులపల్లి వెంకటేశ్వర స్వామీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే వెంకటవీరయ్య-మహాలక్మీ దంపతులు
మన దేశంలో ఆవులను పవిత్రంగా చూడడమే కాక పూజిస్తామని,శుభకార్యాల సందర్భంగా వాటికి ప్రత్యేక స్థానం ఉంటుందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.ఆయన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఖమ్మం నగరం ఖానాపురం టేకులపల్లిలో నెలకొన్న సుప్రసన్న శ్రీవెంకటేశ్వర గోశాలకు పశుగ్రాసాన్ని అందజేశారు.ఎమ్మెల్యే సండ్ర తన సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి సేకరించిన పశుగ్రాసాన్ని (వరి గడ్డి)150ట్రాక్టర్స్ ద్వారా ఈ గోశాలకు తరలించారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్యే వెంకటవీరయ్య వెంట రాగా మండుటెండలో మెయిన్ రోడ్ నుంచి గోశాల వరకు 2కిలోమీటర్లు ట్రాక్టర్ ను నడిపించారు.ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ, అన్నదానం మాదిరిగానే మూగజీవాలకు పశుగ్రాసాన్ని అందించడమనేది కూడా ఒక పుణ్య కార్యం అన్నారు.ఈ సందర్భంగా ఆయన సండ్రతో కలిసి గోశాల చెంతనే ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.ఎంపీ వద్దిరాజు తమ కుటుంబ గోత్రనామంతో ప్రత్యేక పూజలు చేసి, వేదపండితులు,గోశాల నిర్వాహకులు ఆరుట్ల శ్రీనివాసాచార్యులు ఆశీర్వచనాలు పలికి అందించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఎమ్మెల్యే వెంకటవీరయ్యతో కలిసి ఎంపీ రవిచంద్ర గోశాల అంతటా తిరిగి ఆవులకు అరటి పండ్లు తినిపించారు.
ఈ గోశాలతో పాటుగా ఖమ్మంలోని ఇతర గోశాలలకు కూడా ఎమ్మెల్యే సండ్ర ఐదేళ్లుగా పశుగ్రాసాన్ని అందిస్తుండడాన్ని ఎంపీ వద్దిరాజుతో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎన్.మధుసూదన్, డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఉమా మహేశ్వరరావులు అభినందించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెంకటవీరయ్య ధర్మపత్ని మహాలక్ష్మీ తదితర ప్రముఖులు హాజరయ్యారు.