పార్టీపై ఎప్పుడూ అలగలేదు, కొందరు కావాలని ఇబ్బందులు సృష్టిస్తున్నారు: బాలినేని…
- జగన్ ను ఎప్పుడూ కలుస్తూనే ఉంటానన్న బాలినేని
- నియోజకవర్గంపై దృష్టి సారించాలని తనకు సూచించినట్లు వెల్లడి
- మంత్రి పదవి వదులుకొని ప్రోటోకాల్‌పై ఫీల్ అయ్యేది ఏముంటుందన్న బాలినేని
తాను ఎప్పుడూ పార్టీపై అలగలేదని, పార్టీలోని కొందరు ఇబ్బందులు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం సీఎం జగన్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ అధినేతను ఎప్పుడూ కలుస్తూనే ఉంటానని చెప్పారు. నియోజకవర్గంపై దృష్టి సారించాలని సీఎం తనకు సూచించినట్లు చెప్పారు. తాను అన్ని అంశాలపై జగన్ తో చర్చించానని, జిల్లాలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకు వెళ్లానన్నారు.
ప్రోటోకాల్ పెద్ద విషయం కాదని, దానిపై ఫిర్యాదు చేయడానికి ఏముంటుందని వ్యాఖ్యానించారు. కొత్తగా రీజినల్ కోఆర్డినేటర్ పదవిపై చర్చ జరగలేదన్నారు. గతంలోనే తాను ఈ పదవికి రాజీనామా చేశానని, మంత్రి పదవిని వదులుకొని ప్రోటోకాల్‌పై ఫీల్ అయ్యేది ఏముంటుందన్నారు. తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.