Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

శంషాబాద్-విజయవాడ-విశాఖపట్నం మధ్య సూపర్‌ ఫాస్ట్ రైలు!

శంషాబాద్-విజయవాడ-విశాఖపట్నం మధ్య సూపర్‌ ఫాస్ట్ రైలు!

  • కర్నూలు-విజయవాడ మధ్య మరో రైల్వే లైన్‌
  • రెండు లైన్లపై కసరత్తు మొదలెట్టిన రైల్వే శాఖ
  • రూట్ల ఎంపిక కోసం త్వరలో పెట్ సర్వే
  • సర్వే అనంతరం ప్రాజెక్టు మంజూరుపై రైల్వే శాఖ తుది నిర్ణయం

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ గుడ్ న్యూస్! శంషాబాద్-విజయవాడ-విశాఖపట్నం, కర్నూలు-విజయవాడ మధ్య సూపర్ ఫాస్ట్ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా కసరత్తు మొదలెట్టిన రైల్వే శాఖ, ప్రిలిమినరీ ఇంజినీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వేకు తాజాగా అనుమతించింది. సర్వే అనంతరం రైల్వే శాఖ ఈ ప్రాజెక్టుల మంజూరుపై తుది నిర్ణయం తీసుకుంటుంది. శంషాబాద్-విజయవాడ రైలు అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఇటీవల ఈ ప్రాజెక్టుల ప్రాధాన్యత గురించి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వివరించారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రధాన రూట్లలో రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110-150 కిలోమీటర్లు ఉండగా శంషాబాద్-విజయవాడ, కర్నూలు-విజయవాడ మధ్య గంటకు 220 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో రైళ్లను నడపాలని రైల్వే శాఖ యోచనగా ఉంది. ఇందుకోసం నూతన లైన్లను నిర్మించాలని తలపోస్తోంది. ఈ క్రమంలో రూట్‌ను నిర్ణయించేందుకు పెట్ సర్వే కోసం ఓ కాంట్రాక్టర్‌ను కూడా ఎంపిక చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వందేభారత్ రైళ్లను నడిపేందుకు కూడా రైల్వే శాఖ రెడీ అవుతోంది.

Related posts

అయోధ్య రామమందిరం గర్భ గుడిలోకి చేరిన ప్రధాన విగ్రహం

Ram Narayana

ఢిల్లీలో భారీ పేలుడు క‌ల‌క‌లం…

Ram Narayana

ఉజ్వల సిలిండర్ రాయితీ రూ.300కు పెంపు, తెలంగాణకు పసుపు బోర్డు: కేంద్ర కేబినెట్ నిర్ణయాలు

Ram Narayana

Leave a Comment