Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

ప్రతిపక్షాలు ఐక్యంగానే ఉన్నాయి….ఆశ్చర్యకర ఫలితాలు రావడం ఖాయం …అమెరికా పర్యటనలో రాహుల్ …

ప్రతిపక్షాలు ఐక్యంగానే ఉన్నాయి….ఆశ్చర్యకర ఫలితాలు రావడం ఖాయం …అమెరికా పర్యటనలో రాహుల్ …
-వచ్చే ఎన్నికల్లో బీజేపీని విపక్షాలు ఓడిస్తాయన్న రాహుల్ గాంధీ
-విపక్షాలతో మహాకూటమి ఏర్పడుతుందనే నమ్మకం ఉందని వ్యాఖ్య
-హత్యా బెదిరింపులకు తాను ఆందోళన చెందనన్న రాహుల్
-తన ఎంపీ సభ్వత్వాన్ని రద్దు చేసి నాకు ఆయుధం ఇచ్చారు

దేశంలో విద్వేష రాజకీయాలు ఒకవైపు , ప్రేమ రాజకీయాలు మరోవైపు , కొంతమంది దేశాన్ని ముక్కలు చేయాలనీ చేస్తుంటే తాము వాటిని కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అమెరికా పర్యటనలో రాహుల్ భారతీయులు ఏర్పాటు చేసిన వివిధ వేదికల్లో పాలుపంచుకుంటున్నారు . దేశంలోని పరిస్థితులను భారత్ జోడో యాత్ర , కర్ణాటక ఎన్నికల ఫలితాల గురించి ఆయన్న ప్రవాస భారతీయులకు వివరిస్తున్నారు.

దేశంలో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని, ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయని చెప్పారు. విపక్ష పార్టీలతో కాంగ్రెస్ రెగ్యులర్ గా చర్చలు జరుపుతోందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వాషింగ్టన్ లో నేషనల్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల సమయానికి విపక్షాలతో మహా కూటమి ఏర్పడుతుందనే నమ్మకం తనకు ఉందని రాహుల్ అన్నారు. అయితే విపక్ష పార్టీల మధ్య కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని చెప్పారు. తన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం తనకే లబ్ధి చేకూరుస్తుందని అన్నారు. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశాన్ని కల్పించిందని చెప్పారు. బీజేపీ తనకు మంచి గిఫ్ట్ ఇచ్చిందని అన్నారు.

హత్యా బెదిరింపుల గురించి తాను ఆందోళన చెందనని రాహుల్ చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిన వారేనని అన్నారు. తన నానమ్మ, తన తండ్రి నుంచి తాను ఇదే నేర్చుకున్నానని చెప్పారు. 1984లో ఇందిరాగాంధీని ఆమె బాడీగార్డ్స్ హత్య చేశారు. 1991లో రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ సూసైడ్ బాంబర్ పొట్టనపెట్టుకుంది….

Related posts

ఎస్పీ కంచుకోటల్లో బీజేపీ పాగా …ఆజంఖాన్ , అఖిలేష్ సీట్లను కైవశం చేసుకున్న బీజేపీ!

Drukpadam

ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్ కు వస్తున్నారు?: ప్రధాని మోదీని ప్రశ్నించిన కేటీఆర్!

Drukpadam

లోకల్ మాఫియా చెలరేగిపోతోంది.. సామాన్యుడికి భద్రత కరవైంది: ఎమ్మెల్యే ఆనం!

Drukpadam

Leave a Comment