Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గతంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలు.. వాటి ఫొటోలు…!

గతంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలు.. వాటి ఫొటోలు…!

  • ఒడిశా రైలు ప్రమాదంలో 280కి చేరిన మరణాలు
  • నిరంతరాయంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
  • కాలంతో పోటీపడుతూ బాధితులను కాపాడుతున్న సిబ్బంది
Past Train accidents with photos

ఒడిశా రైలు ప్రమాదం భారత రైల్వే చరిత్రలో నమోదైన ఘోర ప్రమాదాల్లో ఒకటని అధికారులు చెబుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ప్రమాదమని చెప్పారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ప్రస్తుతం 280 కి చేరింది. క్షతగాత్రుల సంఖ్య కూడా పెరుగుతోంది. సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బంది కాలంతో పోటీపడుతూ బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ప్రమాదం జరగగా.. సమాచారం అందుకున్న వెంటనే ఒడిశా డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నాయి. అప్పటికే ప్రమాద స్థలంలో స్థానికులు రెస్క్యూ పనులు మొదలు పెట్టారు. రాత్రంతా సాగిన రెస్క్యూ ఆపరేషన్ విరామం లేకుండా ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

గతంలో జరిగిన ఘోర ప్రమాదాలు..
1981 జూన్ 6: బీహార్ లోని భాగమతి నదిపై కట్టిన వంతెన దాటుతుండగా ఓ రైలు ప్రమాదానికి గురైంది. రైలు మొత్తం నదిలో పడిపోయింది. దీంతో రైలులో ప్రయాణిస్తున్న 750 మంది చనిపోయారు.

1995 ఆగస్టు 20: ఫిరోజాబాద్ లో పురుషోత్తం ఎక్స్ ప్రెస్, కాళింది ఎక్స్ ప్రెస్ ను వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 305 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

1998 నవంబర్ 26: జమ్ముతావి సీల్డా ఎక్స్ ప్రెస్ ప్రమాదం. పంజాబ్ లోని ఖన్నాలో పట్టాలు తప్పిన గోల్డెన్ టెంపుల్ మెయిల్ బోగీలను జమ్ముతావి ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 212 మంది చనిపోయారు.

1999 ఆగస్టు 2: పశ్చిమ బెంగాల్ లోని గైసల్ రైల్వే స్టేషన్ దగ్గర్లో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్రహ్మపుత్ర మెయిల్, అవధ్ అస్సామ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. దీంతో 285 మంది ప్రయాణికులు చనిపోగా 300 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాధితులలో ఎక్కువ శాతం మంది ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ సిబ్బందే ఉన్నారు.


2016 నవంబర్ 20: ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో పుఖ్రయాన్ రైలు పట్టాలు తప్పింది. 14 బోగీలు పట్టాలు తప్పడంతో వాటిలోని 152 మంది ప్రయాణికులు చనిపోయారు. మరో 260 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

2002 సెప్టెంబర్ 9: బీహార్ లోని రాఫిగంజ్ స్టేషన్ సమీపంలో ఓ బ్రిడ్జిపై హౌరా రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. పలు బోగీలు బ్రిడ్జి పైనుంచి కిందికి వేలాడాయి. ఈ ప్రమాదంలో 140 మంది ప్రయాణికులు చనిపోయారు.

1964 డిసెంబర్ 23: తమిళనాడులోని రామేశ్వరంలో పంబన్ ధనుష్కోడి ప్యాసెంజర్ ట్రైన్ సముద్రంలో కొట్టుకుపోయింది. సముద్రంలో నిర్మించిన బ్రిడ్జి పైనుంచి రైలు వెలుతుండగా సైక్లోన్ ఏర్పడింది. అలలు ఉవ్వెత్తుగా ఎగిసిపడడంతో ట్రైన్ కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న 126 మంది గల్లంతయ్యారు.

2010 మే 28: జ్ఞానేశ్వరి ఎక్స్ ప్రెస్ ప్రమాదం.. ఝార్ గాం దగ్గర్లో జ్ఞానేశ్వరి రైలు పట్టాలు తప్పింది. కొన్ని బోగీలు పక్క ట్రాక్ పై పడ్డాయి. అదే సమయంలో ఓ గూడ్సు రైలు వేగంగా వచ్చి ఈ బోగీలను ఢీ కొట్టింది. దీంతో 148 మంది ప్రయాణికులు చనిపోయారు.

1988 జులై 8: కేరళలో పెరుమాన్ బ్రిడ్జి పైనుంచి వెళుతుండగా ఓ రైలు పట్టాలు తప్పడంతో కొన్ని బోగీలు అష్టముడి సరస్సులో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 105 మంది ప్రాణాలు కోల్పోయారు.

Related posts

అమెరికాలో గడ్డకట్టిన సరస్సులో నడిచి ముగ్గురు భారతీయుల మృతి!

Drukpadam

కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి!

Drukpadam

డల్లాస్ లో భారతీయ అమెరికన్ మహిళలపై మెక్సికన్ మహిళ దాడి.. బండ బూతులు…

Drukpadam

Leave a Comment