Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఘోర రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన రైల్వే మంత్రులు వీరే!

ఘోర రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన రైల్వే మంత్రులు వీరే!

  • ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం
  • వందల్లో మృతుల సంఖ్య
  • రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు
  • గతంలో పలు సందర్భాల్లో రాజీనామా చేసిన రైల్వే మంత్రులుః

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి 288 మంది వరకు మృతి చెందిన నేపథ్యంలో, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు అశ్విని వైష్ణవ్ నుంచి రాజీనామా ప్రకటనేదీ రాలేదు.

కాగా, గతంలో పలువురు రైల్వే మంత్రులు ఘోర ప్రమాదాలు జరిగిన సమయంలో నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేసిన దృష్టాంతాలు ఉన్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి జవహర్ లాల్ నెహ్రూ క్యాబినెట్లో రైల్వే మంత్రిగా పనిచేశారు.

1956లో ఆయన హయాంలో రెండు రైలు ప్రమాద ఘటనలు జరిగాయి. ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రైలు ప్రమాదంలో 112 మంది మరణించగా, లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేయగా, నాటి ప్రధాని నెహ్రూ ఆమోదించలేదు. ఆ తర్వాత నవంబరులో తమిళనాడులో జరిగిన రైలు ప్రమాదంలో 144 మంది మరణించారు. ఈ ఘటనతో లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేయగా, ఈసారి నెహ్రూ ఆ రాజీనామాను ఆమోదించారు.

ఆ తర్వాత 1999 ఆగస్టులో అసోంలో జరిగిన రైలు ప్రమాదంలో 290 మంది కన్నుమూశారు. ఆ సమయంలో నితీశ్ కుమార్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆయన అసోం రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీ గతంలో ఎన్డీయే సర్కారులో రైల్వే మంత్రిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో రెండు రైలు ప్రమాదాలు జరగ్గా… మమతా రాజీనామా చేయగా… అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆమె రాజీనామాను ఆమోదించలేదు.

2016లో జరిగిన రైలు ప్రమాదాలకు అప్పటి సురేశ్ ప్రభు నైతిక బాధ్యతను స్వీకరించారు. కొంత సమయం వేచిచూడాలని ప్రధాని మోదీ కోరినా… ఆ తర్వాత నెలరోజులకే సురేశ్ ప్రభు రైల్వే మంత్రి పదవి నుంచి వైదొలిగారు.

 

These are the railway ministers who resigned taking moral responsibility for the terrible train accidents!
Bad train accident in Odisha
Death toll in hundreds
Demands for the resignation of Railway Minister Ashwini Vaishnav
Railway Ministers who have resigned on many occasions in the past

 

In the wake of the deadly train accident in Odisha that killed up to 288 people, there are demands for the resignation of Railway Minister Ashwini Vaishnav. However, no resignation announcement has been received from Ashwini Vaishnav so far.

However, there are instances in the past of former railway ministers resigning from their posts taking moral responsibility when serious accidents took place. Lal Bahadur Shastri served as Railway Minister in Jawahar Lal Nehru’s cabinet.

In 1956, two train accidents occurred during his tenure. In August, a train accident in Andhra Pradesh killed 112 people and Lal Bahadur Shastri resigned, which the then Prime Minister Nehru did not accept. Then in November, 144 people died in a train accident in Tamil Nadu. Lal Bahadur Shastri resigned due to this incident, this time Nehru accepted that resignation.

Then in August 1999, 290 people died in a train accident in Assam. Nitish Kumar was the Railway Minister at that time. He resigned taking moral responsibility for the Assam train accident.

Mamata Banerjee, who is currently the CM of West Bengal, previously served as the Railway Minister in the NDA government. In the year 200 two train accidents happened… Mamata resigned… then Prime Minister Atal Bihari Vajpayee did not accept her resignation.

The then Suresh Prabhu took moral responsibility for the 2016 train accidents. Even though Prime Minister Modi asked him to wait for some time… Suresh Prabhu resigned from the post of Railway Minister within a month.

Related posts

నేను ప్రజలు ఎన్నుకున్న సీఎంని.. నీవెవరు?: కేజ్రీవాల్ ఫైర్

Drukpadam

కాంగ్రెస్ హామీ ఇస్తే తప్ప మేం ఈ భేటీకి రాలేం: నితీష్‌కు కేజ్రీవాల్ షాక్

Drukpadam

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివాదాస్పద వ్యాఖ్యలు…

Drukpadam

Leave a Comment