Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ…!

రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ…!

  • ఎయిర్ ఫోర్స్ చాపర్ లో బాలాసోర్ చేరుకున్న ప్రధాని
  • ప్రమాద వివరాలను తెలిపిన కేంద్రమంత్రులు, అధికారులు
  • ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగిన బాలేశ్వర్ ప్రాంతానికి ప్రధాని చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అక్కడే ఉన్న కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, ఇతర అధికారులు ప్రాథమిక నివేదిక వివరాలను ప్రధానికి వివరించారు. ఆ తర్వాత ఆసుపత్రికి చేరుకొని, అక్కడి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అంతకుముందు ప్రధాని మోదీ ఎయిర్ ఫోర్స్ చాపర్ ద్వారా బాలాసోర్ లో ల్యాండ్ అయ్యారు.

ఈ ప్రమాదంలోని బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని  ప్రధాని    చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాఫ్తుకు ఆదేశించామని వెల్లడించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. ఇది దురదృష్టకర సంఘటన అని, దీనిపై అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. గాయపడిన వారికి ఎలాంటి చికిత్స అవసరమైనా ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి, సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మోదీ గాయపడిన కొంతమంది ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దోషులుగా తేలిన వారికి కఠినంగా శిక్షిస్తామన్నారు. గాయపడిన వారిని కలిసినట్లు మోదీ చెప్పారు. ట్రాక్ పునరుద్ధరణకు రైల్వే కసరత్తు చేస్తోందన్నారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్‌లో మూడు వేర్వేరు ట్రాక్‌లపై బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి. ఒడిశా ప్రభుత్వ స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం ప్రకారం రెండు రైళ్లకు చెందిన 17 కోచ్‌లు పట్టాలు తప్పడంతో పాటు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Prime Minister Modi inspected the train accident area…!
The Prime Minister reached Balasore in an Air Force chopper
Union Ministers and officials who gave the details of the accident
Modi will visit the injured in the hospital

Prime Minister Narendra Modi inspected the train accident site. It is known that nearly 300 people lost their lives in a terrible accident where three trains collided in Balasore district of Odisha. The Prime Minister reached the Baleshwar area where the train accident took place around 3.30 pm. They inspected the accident site and inquired about the details of the incident.

Union Ministers Ashwini Vaishnav, Dharmendra Pradhan and other officials who were there explained the details of the preliminary report to the Prime Minister. After that, he will reach the hospital and visit the injured. Earlier, Prime Minister Modi landed in Balasore by Air Force chopper.

The Prime Minister said that the victims of this accident will be supported in all ways. He expressed his condolences to the families of the deceased. It has been revealed that a high-level inquiry has already been ordered into this accident. Those who are being treated in the hospitals are being given the best treatment. He said that this is an unfortunate incident and they are investigating it from all angles. Those responsible for this accident will be severely punished. He said that the government will provide whatever treatment the injured need. He thanked those who responded immediately after the accident and participated in rescue operations.

After inspecting the accident site, Modi spoke to some of the injured passengers. Speaking on this occasion, those found guilty will be severely punished. Modi said he met the injured. He said that the railway is working to restore the track. Bangalore-Howrah Superfast Express, Coromandel Express and goods train on three separate tracks met with an accident at Bahanaga Bazar station in Odisha’s Balasore district. According to the Odisha government’s Special Relief Commissioner’s office, 17 coaches of the two trains derailed and were severely damaged.

Related posts

పొలంలో కనిపించిన యుద్ధ విమానం ఇంధన ట్యాంక్.. స్థానికుల షాక్

Ram Narayana

జైలు అధికారులకు లంచం కేసు.. శశికళపై అరెస్ట్ వారెంట్

Ram Narayana

గుజరాత్ లో పదుల సంఖ్యలో సింహాలు రహదారిపై సంచారం.. 

Drukpadam

Leave a Comment