Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నేను క్యాన్సర్ బారినపడి కోలుకున్నాను… సంచలన విషయం వెల్లడించిన చిరంజీవి…

నేను క్యాన్సర్ బారినపడి కోలుకున్నాను… సంచలన విషయం వెల్లడించిన చిరంజీవి…

  • హైదరాబాదులో స్టార్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవం
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి
  • గతంలో ఏఐజీ ఆసుపత్రిలో తనకు కొలనోస్కోపీ చేశారని వెల్లడి
  • క్యాన్సర్ నిర్ధారణ అయిందని వివరణ
  • సకాలంలో గుర్తించడంతో త్వరగా కోలుకున్నానని స్పష్టీకరణ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హైదరాబాదులో కొత్తగా స్థాపించిన స్టార్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన ఆరోగ్యానికి సంబంధించి సంచలన విషయం వెల్లడించారు.

తాను గతంలో క్యాన్సర్ బారినపడ్డానని తెలిపారు. ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో కొలనోస్కోపీ చేస్తే క్యాన్సర్ నిర్ధారణ అయిందని వివరించారు. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడంతో తీవ్ర నష్టం తప్పిందని, సకాలంలో చికిత్స తీసుకుని బయటపడ్డానని వెల్లడించారు. తనకు క్యాన్సర్ వచ్చిందన్న విషయాన్ని చెప్పడానికి తానేమీ భయపడడంలేదని అన్నారు.

ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే క్యాన్సర్ పెద్ద జబ్బేమీ కాదని చిరంజీవి అన్నారు.

రోగిని ప్రేమించలేని డాక్టర్ అసలు డాక్టరే కాదు: చిరంజీవి

  • హైదరాబాద్ నానక్ రామ్ గూడలో స్టార్ క్యాన్సర్ ఆసుపత్రి
  • ప్రారంభోత్సవానికి హాజరైన చిరంజీవి
  • అప్పట్లో తాను కూడా డాక్టర్ నే అంటూ చిరు చమత్కారం

హైదరాబాదులోని నానక్ రామ్ గూడలో స్టార్ క్యాన్సర్ సెంటర్ నెలకొల్పారు. ఈ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

తన సూపర్ హిట్ చిత్రం శంకర్ దాదా ఎంబీబీఎస్ లోని ఓ డైలాగుతో చిరంజీవి ప్రసంగం ప్రారంభించారు. రోగిని ప్రేమించలేని డాక్టర్ అసలు డాక్టరే కాదు అని చిరంజీవి చెప్పగా, సభికుల నుంచి హర్షధ్వానాలు వెలువడ్డాయి. కానీ ఇక్కడున్న డాక్టర్లందరూ రోగులను మనస్ఫూర్తిగా ప్రేమించేవాళ్లేనని, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అప్పట్లో నేను కూడా డాక్టర్ నే… ఫేక్ డాక్టర్ ని అంటూ చిరంజీవి చమత్కరించారు. 

ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. ఆంకాలజీ విభాగంలో అన్ని రకాల వైద్య సేవలు అందించేలా స్టార్  క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించడం హర్షణీయం అని పేర్కొన్నారు. 

ఈ ఆసుపత్రి వారు అత్యంత ఆధునిక ఎక్విప్ మెంట్ ను కొనుగోలు చేశారని, అయితే, వారు ఆ యంత్ర పరికరాలు ఉపయోగించే అవసరం రాకుండా ఉండాలని, వారు ఈగలు తోలుకుంటూ ఉన్నా ఫర్వాలేదని తనదైన శైలిలో నవ్వించారు. వాళ్లకు లాభాలు రాకపోయినా ఫర్వాలేదు… ప్రజలు ఆరోగ్యంగా ఉంటే అదే చాలు అని పేర్కొన్నారు. ప్రజలెవ్వరూ క్యాన్సర్ బారినపడకూడదన్నదే తన ఉద్దేశమని, ప్రజలు క్యాన్సర్ బారిన పడకపోతే ఆసుపత్రులకు రావాల్సిన అవసరం ఉండదు కదా అని వివరించారు. 

వ్యసనాలకు లోనుకాకుండా ఉంటే, ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉంటే, క్యాన్సర్ బారినపడే అవకాశాలు తక్కువ అని చిరంజీవి స్పష్టం చేశారు. 

ఇటీవల విజయవాడ నుంచి రేణుక అనే అమ్మాయి క్యాన్సర్ తో బాధపడుతూ వచ్చిందని, తన ఆఖరి కోరికగా చిరంజీవిని చూడాలని ఉందని చెప్పిందని వెల్లడించారు. అయితే, తాను ఆ అమ్మాయిని కలిశానని, ఇది చివరి కోరిక కాదమ్మా, ఇదే నీ మొదటి కోరిక అనుకో… నువ్వు ఇంకా జీవిస్తావు అని ఆమెలో ఆత్మవిశ్వాసం కలిగించానని, ఇప్పుడా అమ్మాయి బాగానే ఉందని చిరంజీవి తెలిపారు. 

అంతేకాకుండా, పేదవాళ్లు, తన అభిమానులు, సినీ కార్మికులకు క్యాన్సర్ ముందుగానే గుర్తించేలా ఏవైనా పరీక్షలు ఉంటే చేయాలని, అందుకోసం ఎన్ని కోట్లయినా తాను కూడా తన వంతు సహకారం అందిస్తానని చిరంజీవి వెల్లడించారు. 

అందుకు స్టార్ క్యాన్సర్ సెంటర్ యాజమాన్యం స్పందిస్తూ, చిరంజీవి అద్భుతమైన ఆలోచన అందించారని, తమకు తగిన సాధన సంపత్తితో కూడిన మొబైల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉన్నారని, జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని హామీ ఇచ్చింది.

Chiranjeevi attends Star Cancer Center inauguration in Hyderabad

I have recovered from cancer… Chiranjeevi revealed the sensational thing…
Inauguration of Star Cancer Center in Hyderabad
Chiranjeevi was the chief guest
It was revealed that he had undergone a colonoscopy at AIG Hospital earlier
Explanation that cancer has been diagnosed
Clarification of early recovery with timely detection

Tollywood megastar Chiranjeevi attended the inauguration of the newly established Star Cancer Center in Hyderabad. Speaking in this program, he disclosed a sensational matter regarding his health.

He said that he was affected by cancer in the past. Colonoscopy at the Asian Institute of Gastroenterology (AIG) Hospital revealed that the cancer was diagnosed. It was revealed that due to the early detection of cancer, serious damage was avoided and he was cured after receiving timely treatment. He said that he is not afraid to say that he has cancer.

Chiranjeevi said that cancer is not a big wound if it is detected and treated early.

A doctor who cannot love his patient is not a doctor: Chiranjeevi
Star Cancer Hospital in Nanak Ram Guda, Hyderabad
Chiranjeevi attended the inauguration
It was a joke that he was also a doctor at that time

Star Cancer Center was set up at Nanak Ram Guda, Hyderabad. Tollywood megastar Chiranjeevi was the chief guest at the inauguration of this cancer hospital.

Chiranjeevi started his speech with a dialogue from his super hit movie Shankar Dada MBBS. When Chiranjeevi said that a doctor who cannot love his patient is not a real doctor, cheers erupted from the audience. But all the doctors here love their patients wholeheartedly and I am thankful to them. At that time, Chiranjeevi joked that I am also a doctor… a fake doctor.

He said that it is a pleasure to attend such a program. It is said that the establishment of Star Cancer Hospital to provide all types of medical services in the oncology department is exciting.

The hospital laughed in its own style that they had bought the most modern equipment, but that they should not have to use the equipment, that it was okay if they were swatting flies. It doesn’t matter if they don’t get profits… It is enough if people are healthy. He explained that his intention is that no one should get cancer, and if people do not get cancer, there is no need to come to hospitals.

Chiranjeevi clarified that if one does not indulge in addictions and has regular health checkups, the chances of getting cancer are less.

It was revealed that recently a girl named Renuka came from Vijayawada suffering from cancer and said that her last wish was to see Chiranjeevi. However, Chiranjeevi said that he met that girl, this is not your last wish, think this is your first wish… I made her confident that you will still live and now the girl is fine.

Moreover, Chiranjeevi said that if there are any tests for early detection of cancer for the poor, his fans and film workers, he will also contribute his share of crores for that.

The management of Star Cancer Center responded by saying that Chiranjeevi has given an excellent idea, they have mobile vehicles with adequate equipment, medical experts are also available and assured that they will conduct cancer screening tests in the districts.

 

 

Related posts

పెగాస‌స్ క‌ల‌క‌లంపై విచార‌ణ‌లో కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీజేఐ జ‌స్టిస్‌ ఎన్వీ ర‌మ‌ణ‌!

Drukpadam

నెలకు రూ.లక్ష శాలరీ.. మీమ్స్ చేయడం తెలిస్తే చాలు!

Drukpadam

హింసాత్మక ఘటనలు చెలరేగడంతో పల్నాడు జిల్లాలో 144 సెక్షన్‌ విధింపు…

Ram Narayana

Leave a Comment