Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఆదరణ ఎందుకో చెప్పిన కాంగ్రెస్ నేత!

ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఆదరణ ఎందుకో చెప్పిన కాంగ్రెస్ నేత!

  • భారత్ కు ప్రధాని కావడం వల్లే మోదీకి గౌరవం లభిస్తోందన్న శామ్ పిట్రోడా
  • ప్రధాని బీజేపీకి చెందడం వల్ల కాదని గుర్తించాలని సూచన
  • ఆయన తమకూ ప్రధానియేనని కాంగ్రెస్ నేత వ్యాఖ్య
  • భారత ప్రధానిగా ఆయనకు గౌరవం ఉంటే సంతోషిస్తానని వెల్లడి

నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే తప్ప బీజేపీ వల్ల కాదని కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా అన్నారు. ప్రధానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తోందని ఎవరో తనతో చెప్పారని, అందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఎందుకంటే ఆయన తనకు కూడా ప్రధానియే అన్నారు. కానీ మనం ఎప్పుడు కూడా తప్పు చేయవద్దని, మోదీ భారత ప్రధాని అయినందున ఆయనకు ఆదరణ లభిస్తోందన్నారు. కానీ ఆయన బీజేపీకి చెందడం వల్ల కాదని గుర్తించాలన్నారు. ఈ రెండింటిని వేర్వేరుగా చూడాలన్నారు.

1.5 బిలియన్ల జనాభా ఉన్న దేశ ప్రధానికి ప్రతిచోటా గౌరవం లభించాలని, తాను దాని గురించి గర్వపడుతున్నానని చెప్పారు శామ్ పిట్రోడా. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నందుకు తాను వ్యతిరేకంగా లేనన్నారు. కానీ అధికార పార్టీ వారు ప్రతి సందేశాన్ని ట్విస్ట్ చేస్తారని, గందరగోళానికి గురి చేస్తారన్నారు.

Related posts

కాంగ్రెస్‌కు కేజ్రీవాల్ పార్టీ మరోసారి అల్టిమేటం..!

Drukpadam

నెల రోజుల్లో టమాటా ద్వారా రూ.3 కోట్ల ఆర్జన.. పూణే రైతు కథ ఇది!

Drukpadam

అదే జరిగితే పాకిస్థాన్ ఇక ఉండదు: యోగి ఆదిత్యనాథ్!

Drukpadam

Leave a Comment