Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పట్టువదలని సునీతా…అవినాష్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం లో మరో పిటిషన్!

వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో మరో పిటిషన్

  • అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై ‘సుప్రీం’ను ఆశ్రయించిన వివేకా కుమార్తె సునీత
  • సీబీఐ అవినాశ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసిందని వెల్లడి
  • బెయిల్ మంజూరు సందర్భంగా తెలంగాణ  కోర్టు ఇవేమీ పట్టించుకోలేదని వ్యాఖ్య
  • విచారణ సజావుగా సాగేందుకు బెయిల్ ఉపసంహరించేలా ఆదేశాలివ్వాలంటూ విజ్ఞప్తి
  • నేడు  కోర్టు ముందుకు రానున్న పిటిషన్

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ జారీని వ్యతిరేకిస్తూ వివేకా కుమార్తె సునీత మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అవినాశ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సీబీఐ పేర్కొన్నందున ఆయనకు బెయిల్ రద్దు చేయాలని తన పిటిషన్‌లో కోరారు.

అవినాశ్‌పై సీబీఐ ఇప్పటివరకూ దాఖలు చేసిన ఛార్జిషీట్లు, అఫిడవిట్లు అన్నీ తీవ్రమైనవేనని, కానీ తెలంగాణ కోర్టు మాత్రం వాటిని పరిగణనలోకి తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. జూన్ 30లోగా దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించినందున విచారణ సజావుగా సాగేందుకు అవినాశ్‌కు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరారు. సునీత తరపు న్యాయవాదులు ఈ కేసును బుధవారం ధర్మాసనం ముందు ప్రస్తావించనున్నారు.

Related posts

Drukpadam

ప్రభుత్వం పై సన్నగిల్లిన ఆశలు- పిండిప్రోలులో స్వచ్ఛంద లాక్ డౌన్

Drukpadam

తెలంగాణ మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్

Drukpadam

Leave a Comment