ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై జాతీయ పార్టీల ద్రుష్టి…!
బీఆర్ యస్ మొదటి బహిరంగ సభ ఖమ్మంలోని
బీజేపీ సభ కు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా
11 న సిపిఐ సభకు హాజరు కానున్న డి రాజా
ఈనెల 20 లేదా 25 ఖమ్మం కాంగ్రెస్ సభకు రాహుల్ లేదా ప్రియాంక
సిపిఎం సభలకు వచ్చిన కేరళ సీఎం పినరాయ్ విజయన్
టీడీపీ సభ ఖమ్మంలో జరిగింది …చంద్రబాబు హాజరైయ్యారు
ఖమ్మం జిల్లా రాజకీయాలపై జాతీయ పార్టీలు ద్రుష్టి సారించాయి. చైతన్యానికి , అభ్యుదయ ఉద్యమాలకు గుమ్మంగా ఉన్న ఖమ్మం వేదికగా అన్ని రాజకీయపార్టీలు ,సభలు సమావేశాలు జరుపుతున్నాయి . మరి కొద్దీ నెలల్లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు , వచ్చే సంవత్సరం జరగనున్న లోకసభ ఎన్నికల కోసం పార్టీలు సిద్ధమవుతున్నాయి. జాతీయపార్టీల నేతలు ఖమ్మంనే ఎందుకు యుద్దభూమిగా ఎంచుకుంటున్నారని సహజంగానే సందేహాలు వస్తున్నాయి. ఖమ్మంలో బీఆర్ యస్ సభ తరవాత రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆసభకు ఆప్ కు అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత సింగ్ మాన్, కేరళ సీఎం సిపిఎం నేత పినారాయ్ విజయన్, ఎస్ప్ నేత యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ , సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా , సిపిఎం ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం , కూనంనేని సాంబశివరావు తదితరులు హాజరైయ్యారు . సభకు జనసమీకరణ బాగానే చేశారు .
ఖమ్మం జిల్లాలో ఉన్న బీఆర్ యస్ లో అంతర్గత పోరు పార్టీని దెబ్బ తీస్తుందనే ఇంటలిజన్స్ హెచ్చరికల నేపథ్యంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సభ ఏమైనా ఫలితాలు ఇచ్చిందా అంటే కొశ్చన్ మార్కేగానే మిగిలిందని చెప్పాలి …? సీనియర్ నేత తుమ్మల పార్టీకి దూరంగా ఉండటం , ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతగా పేరున్న పొంగులేటిని పార్టీనుంచి సస్పెండ్ చేయడం, పేరు ప్రతిష్టలు గల జలగం వెంకట్రావు ను దూరంగా పెట్టడం , ఖమ్మం జిల్లా బీఆర్ యస్ కు మైనస్ గా మారాయి. దీనిపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాల్సిన కేసీఆర్ ,కేటీఆర్ లు ఒకసారి ,అరసారి నేతలతో మాట్లాడినప్పటికీ వారి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించడంలో వైఫల్యం చెందారని చెప్పాలి … ఫలితంగా ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ పరిస్థితిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారని సమాచారం …
బీఆర్ యస్ సభకు కొద్దీ రోజుల ముందు సిపిఎం ఆధ్వరంలో జరిగిన రాష్ట్ర వ్యవసాయకార్మిక సంఘం మహాసభ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేరళ ముఖ్యమంత్రి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పినరాయ్ విజయన్ పాల్గొన్నారు . తరవాత టీడీపీ ఆధ్వరంలో జరిగిన సభలో ఏపీ మాజీ సీఎం ఆపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు .
నిరుద్యోగ నిరసన ర్యాలీలతో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి , బీజేపీ నుంచి బండి సంజయ్ లు పాల్గొన్నారు. ఈనెల 15 బీజేపీ జాతీయ నాయకులూ , కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ,ఈ నెల 20 లేదా 25 తేదీలలో రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది .
సిపిఐ ఆధ్వరంలో ఈనెల 11 న కొత్తగూడెం లో భారీ బహిరంగ సభ జరగనున్నది ,దానికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా , కార్యదర్శి కె నారాయణ, అజిజ్ పాషా , రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు , జాతీయ నాయకులు చాడ వెంకట రెడ్డి , పువ్వాడ నాగేశ్వరావు తదిరులు పాల్గొంటారు …దీంతో జిల్లా రాజకీయాలు రంజుగా మారె అవకాశాలు ఉన్నాయి.
బీజేపీకి వ్యతిరేకంగా పుట్టామని దాన్ని పోలి ఉండే విధంగా బీఆర్ యస్ అని పార్టీకి పేరు పెట్టిన కేసీఆర్ నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారా …? లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. బీజేపీ నేతలు సైతం కేసీఆర్ అవినీతి అక్రమాలపై కవిత లిక్కర్ స్కాం పై విమర్శలు గుప్పిస్తున్నా, చర్యలు తీసుకోవడంలో ఎక్కడో తేడా కొడుతుందని అభిప్రాయాలు సామాన్య ప్రజల నుంచే వ్యక్తం కావడం గమనార్హం… మూడవసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న కేసీఆర్ మునుగోడు లో వామపక్షాల సహాయం తీసుకోని తమ మధ్య ఇదే స్నేహం కొనసాగిద్దామని చెప్పారు . అందుకు వామపక్షాలు కూడా అంగీకరించాయి. వారు కొన్ని సీట్లను కోరుతున్నారు …అందుకు ఒకే అన్న కేసీఆర్ వారికి సీట్లను తేల్చడం లేదు …దీంతో లెఫ్ట్ నేతలు అసహనంతో ఉన్నారు .
ఇక నిన్నమొన్నటివరకు పొంగులేటి ఎటు చేరబోతున్నారనేదానికి తెరపడింది. కాంగ్రెస్ కె ఆయన మొగ్గుచూపడం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్నికలు రసవత్తరంగా మారె అవకాశాలు ఉన్నాయి. అయితే పొంగులేటి ఇంకా అధికారికంగా చేరకముందే సీనియర్ కాంగ్రెస్ నేత వి .హనుమంతరావు పొంగులేటికి సీట్లు ఇచ్చే విషయంపై నోరు పారేసుకున్నారు . దీంతో కాంగ్రెస్ లో ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీలో చేరిన తర్వాత ఐదు సంవత్సరాలు పనిచేస్తే గానీ పదవులు ఇవ్వడం లేదా పోటీకి పెట్టడం ఉంటుందని ఒక ఛానల్ ఇంటర్యూ లో చెప్పడం చర్చనీయాంశంగా మారింది.