Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

లక్ష గొంతుకల పొలికేక …సిపిఐ కొత్తగూడం గర్జన….

లక్ష గొంతుకల పొలికేకసిపిఐ కొత్తగూడం గర్జన….
=బీజేపీ అప్రజాస్వామిక విధానాలపై తిరుగుబాటు
=ఖమ్మం గడ్డపై వారిని కాలుమోపనివ్వబోమని ప్రతిన
=మోడీ ,షా లు ఎవరొచ్చినా బీజేపీ ఆటలు సాగవని హెచ్చరిక
=కొత్తగూడెం సభ ద్వారా సిపిఐ సత్తా చాటాలని పట్టుదలతో ఉన్న కూనంనేని
=ప్రజాసమస్యలే ఎజెండాగా ఉద్యమాలు అంటున్న నేతలు
=ప్రజలకు ఉపాధి అవకాశాలు ,కూడు,గూడు , వైద్యం పెన్షన్ సౌకర్యాలు కోసం నిరంతర పోరాటాలు..
=రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టింగ్ ,అవుట్ సోర్సింగ్ విధానాలపై చురకలు

లక్ష గొంతుకుల పొలికేకనే కొత్తగూడెంలో జరగనున్న సిపిఐ ప్రజాగార్జున సభఒకరకంగా చెప్పాలంటే ఉద్యమాలే ఊపిరిగా ఉన్న సిపిఐ పార్టీ కొత్తగూడం సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందికొత్తగూడం కు చెందిన రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జిల్లాలోనే మకాం వేసి సభ జయప్రదం కోసం విస్త్రత పర్యటనలు చేశారు . లక్షమందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు .అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు . ప్రజలను బహిరంగ సభకు సమీకరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వాహనాలను ఏర్పాటు చేశారు . బెల్లంపల్లి నుంచి ప్రత్యేక రైలు కొత్తగూడం కు వస్తుంది. ఆరైలును సింగరేణి కార్మికులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు .

బీజేపీ అప్రజాస్వామిక విధానాలపై తిరుగుబాటు

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్య హక్కులు పై దాడి జరగడం పై సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది..అందుకోసం ప్రజలను సమీకరించి బీజేపీ హటావో ,దేశ్ కి బచావో పేరుతొ జరిపిన యాత్రలకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను ప్రస్తాహిస్తుందిఇప్పటికే దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడమే కాకుండా ప్రజలు సమస్యలు గాలికి వదిలి , పబ్లిక్ రంగ సంస్థలను తెగనమ్ముతుందని అందువల్ల బీజేపీ విధానాలపై తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తుంది. గవర్నర్ల ద్వారా ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో అధికారం చెలాయించడాికిచేస్తున్న ప్రయత్నాలపై మండిపడుతుంది. ఇది ప్రజాస్వామ్య విలువలను మంటగలపడమేనని దుయ్యబడుతుంది. రాష్ట్రంలో ఉన్న సింగరేణి గనులను ప్రవేట్ వారికీ కేంద్రం కట్టబెట్టడంపై భగ్గుమంటుందిదీనిపై ఇప్పటికే పోరాటాలు చేస్తున్న సిపిఐ మరిన్ని పోరాటాలు సమాయత్తం అవుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెపుతున్న బీజేపీ మోడీ అదానీల జోడి అని విమర్శలు గుప్పిస్తుంది. బీజేపీ చర్యలను ఇక సాగనివ్వబోమని కొత్తగూడం సభ ద్వారా మరోసారి చాటి చెప్పాలని ,ఉమ్మడి ఖమ్మం జిల్లా గడ్డపై కాషాయ దళాన్ని కాలుమోపనివ్వబోమని వారికీ చేటు లేదని ప్రతినబూనుతున్నాయి. మోడీ ,షా లు ఎవరు వచ్చిన వారి ఆటలు ఇక్కడ సాగనివ్వబోమని సిపిఐ అంటున్నది .

రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అవుట్ సోర్సింగ్ ,కాంట్రాక్టింగ్ కార్మికులను ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తామని మాట తప్పటాన్ని సిపిఐ తప్పు పడుతుంది. వారికీ ఇచ్చిన హామీని నిలపెట్టుకోవాలని హితవు పలుకుతుంది. పోడు భూముల విషయంలో చెప్పిన లెక్కలకు పంచేదానికి సంబందం లేకుండా ఉండటాన్ని ఎత్తు చూపుతుంది….ప్రజలకు కూడు ,గూడు , ఉపాధి అవకాశాలు వైద్య సౌకర్యలు మెరుగుకు , వృద్దులకు గ్యారంటీ పెన్షన్ పథకం కోసం పాలకులపై వత్తిడి తెస్తామని సిపిఐ చెపుతుంది. నేపథ్యం లో జరుగుతున్న సభలకు ప్రజలు మద్దతు తెలపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు

 

Related posts

రేవంత్​ రెడ్డి ట్వీట్​ పై మంత్రి జగదీశ్​ రెడ్డి మండిపాటు…

Drukpadam

కొత్త రేషన్ కార్డుల జారీకి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదు: మంత్రి శ్రీధర్ బాబు

Ram Narayana

సత్తుపల్లి సభ సాక్షిగా కలిసిన నాయకులు…కలవని మనసులు …

Drukpadam

Leave a Comment