Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

తెలంగాణలో పార్టీ ప్రక్షాళన దిశగా బీజేపీ …!

తెలంగాణలో పార్టీ  ప్రక్షాళన దిశగా బీజేపీ …!
-అధ్యక్షుడి మార్పు తద్యమంటూ వార్తలు
-కొత్త అధ్యక్షులుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , డీకే అరుణ పేర్లు పరిశీలన
-ప్రచార కమిటీ సారధిగా ఈటెల …
-రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలకు కిషన్ రెడ్డి ఆ నాసక్తి అంటూ వార్తలు
-అరుణ వైపే మొగ్గు చూపుతున్న అధిష్టానం
-బీజేపీలో తర్జన భర్జనలు

2023 నవంబర్, డిసెంబర్ లలో జరిగే తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని విశ్వాసంతో ఉన్న బీజేపీ నేడు పార్టీని కాపాడుకొనే పనిలో పడింది. రాష్ట్ర పార్టీలో నాయకుల మధ్య పొసగక పోవడాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంది …అధికారం సంగతి దేవుడెరుగు పార్టీని ,పార్టీలోకి వచ్చిన కొత్తవారిని కాపాడుకునేందుకు మల్లగుల్లాలు పడుతుంది. బీజేపీని రాష్ట్రంలో పూర్తిగా ప్రక్షాళన చేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో బలమైన శక్తిగా పరుగులు పెట్టించాలని చూస్తుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీలోకి రావాలని అనుకున్న అనేక మంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి క్యూకట్టడంపై ఆందోళన చెందుతుంది . తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే ఆలోచనలకు బీజేపీ అధిష్టానం పదును పెడుతుంది …

రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని , ఇక బీజేపీనే, బీఆర్ యస్ కు ఆల్టర్ నేటివ్ అని భావించిన అనేక మందికి నేడు ఆ పరిస్థితి లేదనే క్లారిటీ వచ్చింది. దీంతో కేసీఆర్ ను గద్దె దించేది బీజేపీనే అనుకుని అందులో చేరిన నేతలు పునరాలోచనలో పడ్డారని ప్రచారం జరుగుంది. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న బీజేపీ అధిష్టానం కొంతమంది నేతలను ఢిల్లీకి పిలిచి క్లాస్ తీసుకుంటున్నట్లు సమాచారం …అయితే పార్టీ అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ వైఖరి కారణంగా పార్టీ బలం పెరగక పొగ నష్టం జరుగుతుందని కొందరు అధిష్టానం దగ్గర ఫిర్యాదు చేశారు . దీంతో అందుకు అర్ధ అంగీకారం తెలిపిన అధిష్టానం చివరకు రాష్ట్ర అధ్యక్షుడి మార్పుకు ఒకే అన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాతనే రాష్ట్రంలో పార్టీలో కదలిక వచ్చిందని ,బీజేపీ వైపు ప్రజలు చూడగలిగేలా సంజయ్ చేయకలిగారని కొందరు వాదన కూడా ఉంది … చివరకు బీఆర్ యస్ ప్రత్యాన్మయం బీజేపీ అనే వరుకు తీసుకోని వచ్చిన ఘనత కూడా బండి సంజయ్ దే అంటున్నారు .

బీజేపీ కి కమిట్ మెంట్ గా పనిచేసినప్పటికీ రాష్ట్రంలో అధికార పార్టీని రాజకీయంగా ఎదుర్కోవడంలో సరైన వ్యూహాలు లేవని ఎత్తుగడలు వేయడంలో వైఫల్యం చెందారని ఆయనపై విమర్శలు ఉన్నాయి. ఎంత సేపటికి ప్రజల మౌలిక సమస్యలను వదిలి గుళ్ళు , గోపురాలు అంటూ తిరగటంపై బీజేపీలోనే అంతర్గత చర్చ జరుగుతుందని అంటున్నారు .అందువల్ల ఆయన్ను వెంటనే పదవి నుంచి మార్చాలని డిమాండ్ పెరుగుతుంది. దీనిపై అధిష్టానం ఆలోచనలో పడింది.అందుకు పరిస్కారం మార్గాలు వెతుకుతుంది.

బండి సంజయ్ సేవలను గుర్తించిన హై కమాండ్ ఆయన్ను కేంద్ర మంత్రి మండలిలోకి తీసుకోని గౌరవించాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. బీఆర్ యస్ ను గట్టిగ ఎదుర్కోవాలంటే ఈటెల రాజేందర్ లాంటి వారికీ కీలకమైన ప్రచారం కమిటీ భాద్యతలు అప్పగించాలని ప్రతిపాదన చేసినట్లు సమాచారం … దీంతో రాష్ట్ర రాజకీయాల్లో బలమైన సామాజికవర్గానికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలని ఆలోచనలో ఉంది .దీనిలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తే అయన అందుకు సుముఖంగా లేరని వార్తలు వచ్చాయి. దీంతో అదే సామాజికవర్గాని చెందిన మహిళా నేత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష భాద్యతలు అప్పగించడంతో పాటు అన్ని ఫ్రంటల్ ఆర్గనేజేషన్ బాధ్యతలపై ద్రుష్టి సారించాలని అధిష్టానం ఆలోచనగా ఉందని సమాచారం … రాష్ట్రంలో అధికారం సంగతి సరే…. ముందు పార్టీని చక్కదిద్దుకునే పనిలో బీజేపీ ఉంది …

Related posts

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిపై దాడిపై స్పందించిన గవర్నర్ తమిళిసై.. డీజీపీకి ఆదేశాలు

Ram Narayana

జగన్ తప్పుకుని సీఎం ప‌ద‌విని బీసీల‌కు ఇస్తారా?: య‌న‌మ‌ల

Drukpadam

హనుమకొండలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ!

Drukpadam

Leave a Comment