సిపిఐ కొత్తగూడం గర్జన సభ గ్రాండ్ సక్సెస్ …జోష్ లో సిపిఐ…
–లక్ష గొంతుకలు రణనినాదంతో మరుమోగిన కొత్తగూడం
–ఆకట్టుకున్న కళాకారుల పాటలు ,ఆటలు
–ఎర్రమైయమైన కొత్తగూడం …
–ఎండని సైతం లెక్క చేయకుండా బహిరంగ సభకు వచ్చిన జన వాహిని
సిపిఐ తలపెట్టిన కొత్తగూడెం ప్రజా గర్జన సభ గ్రాండ్ సక్సెస్ అయింది.దీంతో సిపిఐ లో జోష్ నింపింది . ఎర్రజెండా అభిమానులు పులకించారు . లక్ష గొంతుకలు రణనినాదంతో కొత్తగూడెం మరు మోగింది. కొత్తగూడెం లోని ప్రకాశం స్టేడియం కు అన్ని వైపులనుంచి ప్రజావాహిని కదిలి రావడం చూపరులను ఆకర్షించింది . ఎర్రజెండాలు దండు కదిలిందా అన్నట్లుగా ఉంది కొత్తగూడం …దారులన్నీ ప్రకాశం స్టేడియం వైపే అన్నట్లుగా మారింది …
సభ ప్రారంభానికి ముందు కళాకారుల పాటలు ఆటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సిపిఐ కార్యకర్తలు తరలి వచ్చారు . ఇటీవల కాలంలో సిపిఐ ఆధ్వరంలో జరిగిన పెద్ద బహిరంగ సభ కావడం గమనార్హం …
కూనంనేని సూపర్బ్ స్పీచ్ ….
సభకు అధ్యక్షత వహించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సభికులను ఆకట్టుకునేలా అద్భుత ప్రసంగం చేశారు .దేశ పరిస్థితులు , కమ్యూనిస్టుల విధానం , ఎర్రజెండా గొప్పతనం ,ప్రజా పోరాటాలు గురించి ఆయన వివరించిన తీరు ప్రజలను ఆలోచింప జేసింది. కమ్యూనిస్టుల పని అయిపోయిందని అనుకునే వారు కారుకూతలు కుసేవారికి అదిరిపోయే సమాధానం ఇచ్చారు . నీరు ,గాలి ,వెలుగు , సూర్యుడు ,చంద్రుడు ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుందని సభికుల హర్షద్వానాల మధ్య ఉద్యగభరితమైన ప్రసంగం చేశారు . ఎర్రజెండాకు ఎదురు లేదని ,ఉద్యమాల వెలుగులో కార్మికుల రక్తం లో నుంచి పుట్టిన జెండా దీనికి ఎవరు అడ్డం వచ్చిన ఊరుకునేది లేదని స్పష్టం చేశారు . ఎర్రజెండా పేదలకు , కార్మికులు ,యువజనులు , విద్యార్థలు మహిళలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు .ఎందరో పార్టీలు మార్చిన తమ పార్టీలో ఉన్నవారు సిద్దాంతం కోసం ,ప్రజలసమస్యల పరిస్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న విషయాన్నీ గుర్తుంచుకోవాలని అన్నారు . కమ్యూనిస్టులు లేకుండా జరిగిన ఉద్యమాలు లేవని అందుకే కమ్యూనిస్టులు బలపడటం ప్రజల కోసమేనని అన్నారు . ముందుగా సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షబీర్ పాషా నాయకులను వేదిపై ఆహ్వానించారు .