ఆయుర్వేదం లో కరోనా కు అద్భుత చికిత్స
-కృష్ణ పట్నం లో ఒక్క కరోనా పాజిటివ్ లేని వైనం
-వేగబడుతున్న ప్రజలు-పెద్ద పెద్ద క్యూ లైన్లు
– కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లో ఆయుర్వేదం తో కరోనా తగ్గించే అద్భుత చికిత్సకు శ్రీకారం చుట్టారు బోనిగి ఆనందయ్య . ప్రపంచం అంత కరోనా తో విలవిలా లాడుతున్న వేళ ఇప్పటి వరకు ఆ గ్రామం లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. గత 15 సంవత్సరాలుగా ఆయుర్వేదం వైద్య వృత్తిలో ఉన్న ఆనందయ్య కరోనా వచ్చిన వెంటనే వనమూలికలు ఆకులతో మందులు తయారు చేసి గ్రామస్తులకు ఇచ్చారు. దీనితో కరోనా కేసు నమోదు కాక పొగ చుట్టుపక్క గ్రామాల నుంచి పాజిటివ్ వచ్చిన వారు సైతం వచ్చి ముందు తీసుకొని రెండు రోజుల్లోనే నెగిటివ్ రిపోర్ట్ రావడం అందరిని ఆశ్చర్య పరిచింది. ఈనోటా ,ఆనోటా విన్న ప్రజలు కృష్ణపట్నం దారిపట్టారు. ఇది ప్రభుత్వానికి తెలియడంతో విచారణ కోసం అధికారులను పంపించారు. వారు కూడా వచ్చి నిర్దారించుకొని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ప్రభుత్వం మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .
నెల్లూరు కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందుపై జిల్లా అధికారులు పాజిటివ్ నివేదిక సమర్పించారు .ఈ నేపథ్యంలో కృష్ణపట్నం ఆయుర్వేదానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
రేపటి నుండి మందు అందుబాటులోకి వచ్చే అవకాశం. నిబంధనలు పాటిస్తూ ఇవ్వాలని ఆదేశం..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం కరోనా మందు పంపిణీపై స్పష్టతనిచ్చిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి…కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా వ్యాధిని నియంత్రించడానికి, కరోనా సోకిన వారికి నయం చేయడానికి అందజేస్తున్న మందును, రేపటి నుండి (21-05-2021, శుక్రవారం) నుండి పంపిణీ చేస్తున్నాం. ప్రకృతిపరంగా దొరికే సహజసిద్ధమైన వస్తువులతో, ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందు పట్ల ఎటువంటి హానీ ఉండదు.
కృష్ణపట్నంలో అందజేస్తున్న మందు వల్ల అనేకమంది కరోనా బారి నుండి బయటపడి, వారి ఆరోగ్యం కుదుటపడింది.ఆనందయ్య అందిస్తున్న మందు పట్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. కరోనా ఉదృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి, తిరిగి ఆయుర్వేద మందును పంపిణీ చేయాలని నిర్ణయించాం.
రేపటి నుండి అనగా తేది:21-05- 2021, శుక్రవారం ఉదయం నుండి కరోనా సోకిన వారికి వేరుగా, కరోనా రాకుండా నియంత్రించడానికి వేరుగా భౌతిక దూరం పాటిస్తూ, మందు పంపిణీ చేపడుతున్నాం.
previous post