Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్  సహనశీలి  :శాసన మండలి చైర్మన్ షరీఫ్!

సీఎం జగన్  సహనశీలి  :శాసన మండలి చైర్మన్ షరీఫ్!
సీఎం జగన్ నన్ను చాలా ఆప్యాయంగా పలకరించేవారు:
మండలి చైర్మన్ గా ఈ నెలతో ముగియనన్ను షరీఫ్ పదవీకాలం
నేడు వీడ్కోలు సభ.. భావోద్వేగాలకు గురైన షరీఫ్
జగన్ తనను ఎంతో గౌరవంగా చూసుకున్నారని వెల్లడి
చంద్రబాబు తన కష్టాన్ని గుర్తించారని వివరణ
రాష్ట్ర ముఖ్యమంత్రి వై .యస్ జగన్ చాలాగొప్ప సహనశీలి అని మండలి చైర్మన్ షరీఫ్ కితాబునిచ్చారు.ఆయన రిటైర్ మెంట్ సందర్భంగా మాట్లాడుతూ తనను అందరు సహనశీలి అని అంటరాని కాని నాకన్నా పెద్ద సహనశీలి ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు .టీడీపీ కి చెందిన షరీఫ్ ముఖ్యమంత్రి ని పొంగడంతో పాటు తమ పార్టీ అధినేత చంద్రబాబు తన కష్టాన్ని గుర్తించే తనకు చైర్మన్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.తనకు ఇవి చివరి సమావేశాలు అంటూ ఇక్కడ అనేక అనుభవాలు నేర్చుకున్నానని ,ఎందరో తనకు మార్గదర్శకులుగా నిలిచారని పేర్కొన్నారు. ఇది ఒక అరుదైన అవకాశం ఇందులో తననడవడికి కొందరిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు అందుకు దయార్ద హృదయం తో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు.
ఏపీ శాసనమండలి చైర్మన్ గా షరీఫ్ పదవీకాలం ఈ నెలతో ముగియనుండడంతో ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రస్తావన తీసుకువచ్చి భావోద్వేగాలకు గురయ్యారు. జగన్ తనను ఎంతో ఆప్యాయంగా “షరీఫ్ అన్నా” అని పిలిచేవారని గుర్తు చేసుకున్నారు.

రాజధానుల బిల్లుల సమయంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యానని, రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ ఎప్పట్లాగానే “షరీఫ్ అన్నా” అని పిలిచి, ఎందుకలా బాధగా ఉన్నారని అడిగారని షరీఫ్ వెల్లడించారు. మండలిలో చోటు చేసుకున్న పరిణామాలతో కలత చెందినట్టు ఆయనకు చెప్పానని తెలిపారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తనను సీఎం జగన్ చాలా గౌరవించారని పేర్కొన్నారు.

‘అందరూ నాకు సహనం ఎక్కువని అంటారు… కానీ నాకంటే సీఎం జగన్ కు సహనం ఎక్కువ’ అని షరీఫ్ అభిప్రాయపడ్డారు. పరిస్థితుల నేపథ్యంలో మండలి చైర్మన్ పదవి తనను వరించిందని, చంద్రబాబు తన కష్టాన్ని గుర్తించి చైర్మన్ పదవికి ఎంపిక చేశారని వివరించారు.ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు ఎమ్మెల్సీలు పాల్గొని మాట్లాడారు.

Related posts

డాలర్ రాజ్యంలో డేంజర్ బెల్స్…

Drukpadam

యూకేలో వంద కంపెనీలలో వారానికి నాలుగు రోజులే ఆఫీసు..

Drukpadam

How To Make Your Own Organic Shampoo At Home With 10 Steps

Drukpadam

Leave a Comment