Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

ఈనెల 22 న ఢిల్లీలో పొంగులేటి ,జూపల్లి రాహుల్ గాంధీతో భేటీ !

ఈనెల 22 న ఢిల్లీలో పొంగులేటి ,జూపల్లి రాహుల్ గాంధీతో భేటీ !
-పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు
-బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి, జూపల్లి
-ఈ నెల 22న రాహుల్ గాంధీతో భేటీ పై క్లారిటీ …కాంగ్రెస్ వర్గాలు
-ఈ నెలాఖరున కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు దాదాపుగా నిర్ణయం!

బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు . వీరు కాంగ్రెస్ లో చేరికపై వస్తున్నా వార్తలకు ,సందేహాలకు ,శషభిషలకు ఇక తావులేదు… వారు తిరిగి ఘర్ వాపసీ అని , బీజేపీలో చేరతారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వారిపై రకరకాల రూమర్స్ ట్రోల్ అవుతున్నాయి. వాటికీ తెరదించుతూ రాహుల్ గాంధీ అమెరికా పర్యటన నుంచి రాగానే వారిని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈనెల 22 న వారు ఢిల్లీలో రాహుల్ గాంధీని కలవనున్నారు . ఈ నెలాఖరున ఖమ్మంలో కాంగ్రెస్ భారీ సభ నిర్వహిస్తుండగా, ఈ సభలో పొంగులేటి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. అయితే కాంగ్రెస్ నిర్వహించే సభలో చేరతారా లేక తానే ఒక సభ ఏర్పాటు చేసి తన అనుయాయులతో కలిసి భారీ ఎత్తున చేరతారా అనేది నిర్దారణ కావాల్సి ఉంది. అయితే రాహుల్ ను కలిసిన తర్వాత దానిపై స్పష్టత వస్తుందని సమాచారం …

ఇక నాగర్ కర్నూలు సభలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరతారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ నెల 22న పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్న నేపథ్యంలో, వీరు కాంగ్రెస్ లోకి వెళుతున్నారన్న కథనాలకు బలం చేకూరుస్తోంది. వీరిద్దరితో పాటు కె.దామోదర్ రెడ్డి కూడా రాహుల్ ను కలవనున్నట్టు తెలుస్తోంది. దాంతో, దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారన్నదానిపై స్పష్టత వచ్చింది.

పొంగులేటి, జూపల్లి చాలాకాలం నుంచి ఏ పార్టీలోకి వెళతారన్నది తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. వీరిద్దరితో తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పలుమార్లు భేటీ అయ్యారు. అయితే, వీళ్లిద్దరూ బీజేపీలోకి వెళ్లడం అటుంచి, బీజేపీ నుంచి బయటికి రావాలని ఈటల రాజేందర్ కే ఆఫర్ ఇచ్చారట. దాంతో, ఈటల వీరిద్దరితో సంప్రదింపుల పర్వానికి అంతటితో తెరదించారు.

Related posts

స్టాలిన్ కే తమిళ ప్రజలు పట్టం కట్టనున్నారా …?

Drukpadam

అమేథి లో రాహుల్, ప్రియాంక కవాత్…భారీగా స్పందన!

Drukpadam

కేసీఆర్ జైలుకు వెళ్ళక తప్పదు అరవింద్ …అబద్ధాలకోరు కేసీఆర్ …బండి సంజయ్ …

Drukpadam

Leave a Comment