షర్మిల జెండా ఎత్తి వేస్తున్నారా …? కాంగ్రెస్ కు జై కొట్టబోతున్నారా …??
తెలంగాణ జనసమితి కూడా కాంగ్రెస్ లో విలీనం అవుతుందా …?
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్తలు
ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ను కలిసిన షర్మిల
ఫ్యామిలీ ఫ్రెండ్స్ …రాజకీయ ప్రాధాన్యత లేదని వెల్లడి
ఇటీవల స్పీడ్ తగ్గించిన షర్మిల
కాంగ్రెస్ లో చేరి పాలేరు నుంచి పోటీచేస్తున్నారని ప్రచారం
ఖండించని , ద్రువీకరించని వైయస్సార్ టీపీ వర్గాలు
షర్మిల ….వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు …తన పార్టీ జెండా ఎత్తి వేస్తున్నారని ఆమె కాంగ్రెస్ కు జై కొట్టబోతున్నారా అంటే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు పరిశీలకులు …ఆమె కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై షర్మిలగాని , ఆమె పార్టీ నేతలుగాని ఎవరు ఈ వార్తలను ఖండించడంలేదు . దీంతో కాంగ్రెస్ లోకి వెళుతున్నారని కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెకు మంచి ఆఫర్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతుంది. త్వరలో ఆమె ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తో పాటు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ , సోనియా ను కలిసే అవకాశాలు ఉన్నట్లు వినికిడి . సొంత పార్టీ పెట్టి అధికారంలోకి రావాలనుకున్న షర్మిల అంత తొందరగా కాంగ్రెస్ లో చేరేందుకు ఒప్పుకుంటారా అనే మరో వాదన కూడా ఉంది. షర్మిల ను పార్టీలోకి తీసుకోని వచ్చేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం . ఆమె ఇటీవల కాలంలో రెండు సార్లు బెంగుళూర్ లో ఆయన్ను కలిశారు . ఇది ప్రవేట్ కలయికే అని చెపుతున్నప్పటికీ రాజకీయాలు తప్పకుండ ఉండిఉంటాయనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణాలో వైయస్సార్ సంక్షేమరాజ్యమే లక్ష్యంగా పార్టీ పెట్టిన షర్మిల రాష్ట్రంలో విస్తృతంగా పాదయాత్రలు చేపట్టారు . సుమారు 4 వేల కి ,మీ ఒక్క తెలంగాణ లో పాదయాత్ర చేసిన మహిళా నాయకురాలుగా చరిత్రలో నిలిచారు . నిర్యుద్యోగ యువతకు ఉద్యోగాలు కోసం , రైతుల సమస్యలపై , టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజిపై ఉద్యమాలు నడిపారు. అనేకమార్లు అరెస్టులు అయ్యారు . అయినప్పటికీ చలించక కేసీఆర్ సర్కార్ పై ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు . పాదయాత్రలో రాళ్ళూ రువ్వగా దెబ్బతిన్న కారుతో సహా ఆమె హైద్రాబాద్ లో ప్రగతి భవన్ స్వయంగా నడుపుకుంటూ వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే …తర్వాత పేపర్ లీకేజి వ్యవహారంలో ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమయ్యారని ఆమెను తన ఇంటివద్దనే పోలీసులు అడ్డుకున్నారు . ఈ సందర్భంగా పోలీసులకు ఆమెకు తోపులాట జరిగింది. తల్లి విజయమ్మ కూతురును చూడటానికి పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే అక్కడ ఆమెను అడ్డుకున్నారు . పోలీసులతో ఘర్షణ జరిగింది. అయినప్పటికీ ఆమె పట్టుదలతో ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వంపై యుద్దానికి సిద్ధమైయ్యారు . కానీ పార్టీకి ఆమె అనుకున్నంత జోష్ రావడంలేదని అభిప్రాయాలు ఉన్నాయి. ఆమె పార్టీ పెట్టగానే అనేకమంది పార్టీలో చేరతారని భావించారు . కానీ అది జరగలేదు . పైగా అన్నతో పంచాయతీ ఉంటె ఆంధ్రా లో పార్టీ పెట్టలేగాని తెలంగాణ లో ఏమిటి ..?అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి . పాదయాత్ర సందర్భంగా ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని షర్మిల ప్రకటించారు . దానికి అనుగుణంగా నియోజకవర్గంలో కార్యాలయం కట్టించేందుకు స్థలం కొనుగోలు చేసి భూమి పూజ కూడా చేశారు . దాని దగ్గర నాటి నుంచి తట్టెడు మట్టి కూడా పోయలేదు . వేరే చోట పాలేరు నియోజకవర్గం క్యాంపు కార్యాలయం కూడా ప్రారంభించారు . మొదట్లో చనిపోయిన వాళ్ళ ఇళ్లకు వెళ్లి 25 వేల రూపాయల చొప్పున పంపిణి చేశారు .తర్వాత దాన్ని నిలిపివేసి అబాసు పాలైయ్యారు . అనేక ఆటంకాలు , పార్టీకి ఆదరణ లేక పోవడం , కాంగ్రెస్ నుంచి మంచి ఆఫర్ రావడంతో ఆమె కాంగ్రెస్ లో చేరి పాలేరు లో పోటీచేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ప్రొఫెసర్ కోందండరాం స్థాపించిన తెలంగాణ జనసమితి కూడా కాంగ్రెస్ లో విలీనం అవుతుందని ప్రచారం జరుగుతుంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ మంచి జోష్ మీద ఉంది …పొంగులేటి , జూపల్లి చేరిక మరింత ఊపు నిచ్చింది… కొంతకాలం వరకు బీజేపీ బీఆర్ యస్ కు పోటీ అనే అభిప్రాయాలు ఉండగా ఇప్పుడు బీఆర్ యస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందనే వాతావరణం వచ్చింది….