Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ టికెట్స్ ఆశిస్తున్నవారి జాబితా …!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ టికెట్స్ ఆశిస్తున్నవారి జాబితా …!
పొంగులేటి రాకతో కాంగ్రెస్ లో నూతన ఉత్తేజం
-10 నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఫోకస్
కాంగ్రెస్ లోకి పొంగులేటిప్రకటనే తరువాయి
రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం
ఈనెల 22 రాహుల్ తో భేటీ

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు ఏస్తుంది . రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ యస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. ఇందుకోసం అధికార బీఆర్ యస్ ను వ్యతిరేకిస్తున్న నాయకులను ఐక్యం చేసే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది .దీనికి తోడు కేసీఆర్ ను గద్దె దించాలనే గట్టి పట్టుదలతో ఉన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి నేడే రేపో కాంగ్రెస్ లో చేరనున్నారు . ఇందుకోసం కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ టికెట్స్ పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో చేరాలని అనుకున్నా టికెట్స్ విషయంలో క్లారిటీ కోసం నాయకులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం .

పొంగులేటి జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు తన అనుయాయులను ఇంచార్జిలుగా నియమించారు . రెండు ,మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించారు .దీంతో ఆయన అనుకున్న అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా …? అంగీకరించకపోతే కీం కార్త్యవం అనే చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ టికెట్స్ ఆశిస్తున్నవారి జాబితా విధంగా ఉందిఅయితే ఇందులో కొన్ని మార్పులు చేర్పులకు అవకాశం ఉన్న 90 శాతం వీరిలోనుంచే పోటీచేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా సీఎల్పీ నేత భట్టి , మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి , పొంగులేటి మధ్య సయోధ్య కుదిరితే అన్ని పరిస్కారమవుతాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

ఖమ్మం జనరల్

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీచేస్తారు . బీఆర్ యస్ నుంచి మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ ను ఎవరు ఎదుర్కొంటారు అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మహమ్మద్ జావేద్ నియోజకవర్గం ఇంచార్జి గా ఉన్నారు . ఆయన టికెట్ ఆశిస్తున్నారు .ఆయనతోపాటు మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ,కాంగ్రెస్ లోకి నేడో రేపో చేరబోతున్న పొంగులేటి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇక్కడ బలమైన అభ్యర్థికోసం కాంగ్రెస్ అన్వేషణలో ఉంది

పాలేరు జనరల్ ….

పాలేరు నియోజకవర్గం నుంచి రాయల నాగేశ్వరావు పేరు పరిశీలనలో ఉంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి , మహిళా సర్పంచ్ , పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ , పొంగులేటి ఇయ్యంకుడు వరంగల్ మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు రఘుమారెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. అన్యూహ్య రాజకీయ మార్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదుఅదే జరిగితే మాజీమంత్రి కూడా పోటీలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు . షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనమైతే ఆమె పాలేరు నుంచి పోటీ ఖాయంగా కనిపిస్తుంది .

మధిర ఎస్సీ ….

మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పోటీ ఖాయంఆయన సీఎం రేసులోకూడా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన పీపుల్స్ మార్చ్ యాత్రలో ఉన్నారు.దళిత సీఎం అనే నినాదం వస్తే భట్టి రాష్ట్రానికి కాబోయే సీఎందీంతో నియోజకవర్గంలో కూడా మార్పులు రానున్నాయి. నేపథ్యంలో ఆయన గెలుపు కేక్ వాక్ అంటున్నారు . అయితే పొంగులేటి అనుయాయుడుగా ఉన్న డాక్టర్ కోటా రాంబాబుకు ఎమ్మెల్సీ ఆఫర్ చేసే అవకాశం ఉందని సమాచారం .

వైరాఎస్టీ నియోజకవర్గం

ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరుపున లిస్ట్ చాల ఉంది…. ఎవరికీ ఇవ్వాలనేది పెద్ద సమస్యపొంగులేటి మాత్రం ఇక్కడ గుగులోత్ విజయాబాయి కోసం పట్టు బడుతున్నారు. కాంగ్రెస్ పరిశీలనలో రామ్మూర్తి నాయక్ ,బాలాజీ నాయక్ మరికొంతమంది ఉన్నారు . ఇది మొదటి నుంచి కాంగ్రెస్ కు బాగా పట్టు ఉన్న నియోజకవర్గం

ఇల్లందు ఎస్టీ ….

ఇక్కడ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అభ్యర్థిగా ఉండటం దాదాపు ఖాయమైంది. అయితే కాంగ్రెస్ నుంచి కూడా చీమల వెంకటేశ్వర్లు , మరో మహిళా అభ్యర్థి ,ఎస్టీ లంబాడా సామాజికవర్గాల నుంచి పేర్లు వినిపిస్తున్నాయి. ఛాన్స్ మాత్రం కనకయ్య కే అంటున్నారు .

కొత్తగూడెం జనరల్

ఇక్కడ నుంచి ఇప్పటికే పీసీసీ ఉపాధ్యక్షుడు పోట్ల నాగేశ్వరావు, పీసీసీ కార్యదర్శి ఎడవల్లి కృష్ణ ఉండగా ,మరికొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. పొంగులేటి ఖమ్మం నుంచి కాకపోతే కొత్తగూడెం వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా మాజీ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ లోచేరితే సీటు ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రకరకాల సామజిక సమీకరణాలు , పొందికలు ఉండటంతో చివరివరకు ఎవరు అభ్యర్థి అవుతారనేదానిపై స్పష్టత లేదుసర్వే రిపోర్టుల ఆధారంగా అభ్యర్థి నిర్ణయం జరుగుతుంది

సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గం

నియోజకవర్గం నుంచి పోటీ గట్టిగానేఉంది….ప్రధానంగా కాంగ్రెస్ లో పోటీ చేసే వారు సంఖ్య కూడా బాగానేవుంది. పొంగులేటితో కాంగ్రెస్ లో చేరబోతున్న సుధాకర్ ,మాజీ మంత్రి సంభాని ,పీసీసీ అధికార ప్రతినిధి మానవతా రాయ్, ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మట్టా దయానంద్ లు టికెట్ ఆశిస్తున్నారు .

అశ్వారావుపేట ఎస్టీ నియోజకవర్గం

ఇక్కడ నుంచి టికెట్ ఆశించేవారిలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు , సున్నం నాగమణి , పొంగులేటి అనుయాయుడు జారే ఆదినారాణ మరో ఇద్దరు ఉన్నారు . సర్వే పైనే టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది.

పినపాక ఎస్టీ నియోజకవర్గం

ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసేందుకు ముందుకు వచ్చే వారి సంఖ్య భారీగానే ఉంది. పొంగులేటి అనుచరుడు పాయం వెంకటేశ్వర్లు తోపాటు , పి. శ్రీవాణి , మాజీ జడ్పీటీసీ భట్టు విజయ్ గాంధీ , సీతక్క కుమారుడు సూర్య, మాజీ జడ్పీ చైర్మన్ చందా లింగయ్య దొర కుమారుడు చందా సంతోష్ ఉన్నారు . ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక పార్టీకి కత్తిమీద సాములాంటిది….

భద్రాచలం ఎస్టీ నియోజకవర్గం

ఇక్కడ నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పొదెం వీరయ్య ఉన్నారు . ఆయన ములుగు నుంచి పోటీచేయాలని కుతూహలంతో ఉన్నారు . సీతక్కను పార్లమెంట్ కు పోటీచేయించాలని రాహుల్ గాంధీ నుంచి సంకేతాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే పొదెం వీరయ్య సీటు మారతారు .అప్పడు పొంగులేటి అనుయాయుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు బరిలో నిలిచే అవకాశం ఉంది

 

Related posts

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

Drukpadam

జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయండి…టీయూడబ్ల్యూజే

Ram Narayana

రెండు నెలలపాటు కరెంటు బిల్లులకు కేరళ సీఎం రిలీఫ్

Drukpadam

Leave a Comment