Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బెంగాల్ టైగర్ తిరిగి భవానీపురా నుంచే పోటీ…

బెంగాల్ టైగర్ తిరిగి భవానీపురా నుంచే పోటీ…

-తన పాత నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న మమతా బెనర్జీ
-భవానీపురం నియోజవర్గ ఎమ్మెల్యే పదవికి మంత్రి చటోపాధ్యా రాజీనామా
-ఆరు నెలల వరకు ఎమ్మెల్యేగానే కొనసాగనున్న చటోపాధ్యా
నందిగ్రామ్ నుంచి ఓడిపోయిన మమత
ఆరు నెలల్లోగా గెలవాల్సిన ఆవశ్యకత
భవానీపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న దీదీ
బెంగాల్ టైగర్ గా పేరొందిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిరిగి తన పాత నియోజకరగమైన భవానీపురా నుంచి పోటీ చేయనున్నారు.అందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఆమె నందిగ్రామ్ నుంచి పోటీచేసి సువెందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. కానీ రాష్ట్రంలో 294 నియోజకవర్గాలకు గాను 215 నియోజకవర్గాలలో ఘనవిజయం సాధించాడు. ఒంటి చేతితో ఎన్నికలను నడిపించారు. ప్రధాని మోడీ ,హోమ్ మంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షులు జె పి నడ్డలాంటి హేమ హేమీలు ఆమెకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేసినప్పటికీ బెంగాల్ ప్రజలు ఆమె పై విశ్వాసం ఉంచి అఖండ విజయం అందించారు. కావాలనే నందిగ్రామ్ లో పోటీచేసిన మమతా బెనర్జీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ… నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన మమత బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లోగా ఆమె ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో, తన పాత నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. భవానీపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ మంత్రి చటోపాధ్యాయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన స్థానం నుంచి దీదీ పోటీ చేస్తారని ఆయన తెలిపారు. అయితే ఈ 6 నెలల కాలం ఆయన మంత్రిగానే కొనసాగనున్నారు.

భవానీపూర్ ఓటరుగా మమతా బెనర్జీ ఉన్నారు. ఎన్నికల సందర్భంగా దీదీ మాట్లాడుతూ… నందిగ్రామ్ తన లక్కీ ప్లేస్ అని, అందుకే తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు. భవానీపూర్ ప్రజలు తన నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని అన్నారు. నందిగ్రామ్ తన పెద్ద సోదరి, భవానీపూర్ తన చిన్న సోదరి అని చెప్పారు.తిరిగి భవానీపుర నుంచి పోటీచేస్తారని వస్తున్నా వార్తల నేపథ్యంలో అక్కడ నియోజకవర్గ ప్రజలు ఆమె రాకకోసం ఎదురు చూస్తున్నారు.

Related posts

మహారాష్ట్రలో రాజకీయ దుమారం …సీఎం షిండే కుర్చీలో కూర్చున్న తనయుడు …

Drukpadam

జగన్ స్పీచ్ ప్రధానిని ఆలోచనలో పడేసిందా…!

Drukpadam

తెలంగాణ పై విషం చిమ్మిన మోడీ …మంత్రి నిరంజన్ రెడ్డి ఘాటు స్పందన !

Drukpadam

Leave a Comment