Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

బీజేపీలో లుకలుకలు …ఈటెల ,రాజగోపాల్ రెడ్డిలు పార్టీ కార్యక్రమాలు దూరం …దూరం …

బీజేపీలో లుకలుకలు …ఈటెల ,రాజగోపాల్ రెడ్డిలు పార్టీ కార్యక్రమాలు దూరం …దూరం …
ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన సందర్భంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమం
అధిష్ఠానం వైఖరి పట్ల కొద్దికాలంగా ఆగ్రహంగా ఉన్న నేతలు
ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి అంటూ ప్రచారం
పార్టీలో ఆ పదవి ఉండదని మరికొందరి మాట
వారి కదలికలపైబీజేపీ నేతల ఆరా ….!
రాష్ట్రంలో బీఆర్ యస్ ను ఎదుర్కోవడంలో పార్టీలో భిన్న అభిప్రాయాలు
ఈటెల ,కోమటిరెడ్డి పార్టీని వీడుతున్నారని ప్రచారం
వారిని బుజ్జగించే ప్రయత్నంలో అధిష్టానం
బీఆర్ యస్ పై బీజేపీ వైఖరిని వెల్లడించాలని నేతల పట్టు

తెలంగాణ రాష్ట్ర బీజేపీలో లుకలుకలు బయలుదేరాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు గన్న బీజేపీకి అవి కల్లలుగానే మిగిలి పోనున్నాయా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2018 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 4 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి మంచి ఊపు మీద ఉన్న బీజేపీకి తరవాత జరిగిన పరిణామాలు ఆశాజనకంగా మారడంతో అధిష్టానం సైతం తెలంగాణ పై ద్రుష్టి సారించింది. అనేక మంది నేతలు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు . దీంతో బీజేపీ గ్రాఫ్ బాగా పెరిగింది.రాష్ట్రంలో బీఆర్ యస్ కు బీజేపీనే ప్రత్యాన్మయం అనే స్థాయికి చేరింది. దానికి తోడు మాజీఎంపీలు కొండా విశ్వేశ్వర రెడ్డి ,జితేందర్ రెడ్డి , డాక్టర్ బుర్ర నర్సయ్య గౌడ్ , ఈటల రాజేందర్ , కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి ముఖ్యనేతలు చేరారు . కానీ బీఆర్ యస్ ను ఓడించేందుకు చేరిన నేతలకు బీజేపీలో జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటంలేదు . వారి ఏ ఆశయంతో వచ్చారో బీజేపీ ద్వారా అవి నెరవేరే సూచనలు కన్పించడంలేదనే అనుమానాలు ఉన్నాయి. . అంతే కాకుండా రెండు పార్టీలు పైకి దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తున్న లోపల ఎదో నిగూడ రహస్యం ఉందనే సందేహాలు కలుగు తున్నాయి. ఇది వారి చర్చల్లో కూడా వ్యక్తం అవుతుంది. పైకి శత్రువులు లోపల మిత్రులుగా వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ నేతల్లో అసమ్మతి నెలకొన్నది కొందరు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు .

ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి ఆ పార్టీ సీనియర్లు కొందరు దూరంగా ఉన్నారు. కీలక నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో పాల్గొనలేదు. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి వీరు హాజరుకాకపోవడంపై చర్చ సాగుతోంది. అధిష్ఠానం వైఖరి పట్ల వీరిద్దరు ఆగ్రహంతో ఉన్నారని, అందుకే పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్నారని చెబుతున్నారు.

ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి అంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ఈటలకు వ్యతిరేకంగా సమావేశమై అసలు పార్టీలో ఆ పదవి ఉండదని, జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలతో చర్చించాక ప్రకటిస్తుందని, అంతే తప్పితే లీక్ లు ఇవ్వవద్దని అంటున్నారు. అప్పటి నుండి ఈటల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Related posts

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి: షర్మిల

Drukpadam

అచ్చెన్నాయుడు హౌస్ అరెస్ట్.. ఇంటి చుట్టూ పోలీసులు!

Drukpadam

కేసీఆర్‌తో మ్యాచ్ ఫిక్సింగా..?: మోదీకి సీఎల్పీ నేత భట్టి బహిరంగ లేఖ..!

Drukpadam

Leave a Comment