Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

విశ్వనగరం హైద్రాబాద్ నివాస యోగ్యానికి పనికి రాదట …!

నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ కు లేని చోటు!

  • ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా వియెన్నా
  • తర్వాతి స్థానాల్లో కోపెన్ హాగెన్, మెల్ బోర్న్
  • 141 స్థానంలో ఢిల్లీ, ముంబై

మన హైద్రాబాద్ విశ్వనగరం … అన్నిట్లో నెంబర్ వన్ అని తెగ గొప్పలకు పోతున్నాం… అందుకు మేమంటే మేమే కారణం …అంటూ రాజకీయ నాయకులు నిత్యం డబ్బాలు కొట్టుకోవడం చూశాం ..  హైద్రాబాద్ అభివృద్ధి మావల్లే   జరిగిందని వాదులాడుకోవడం వింటున్నాం …  కానీ విశ్వనగరంగా చెప్పుకుంటున్న  హైద్రాబాద్ నివాస యోగ్యానికి పనికి రాదట … . ప్రపంచంలో నివాస యోగ్యమైన నగరాల్లో హైద్రాబాద్ కు చోటు లేదని తేలింది “ది ఎకనామిస్ట్’కు చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్” విడుదల చేసిన జాబితాలో చిట్ట చివరి స్థానంలో కూడా హైద్రాబాద్ లేకపోవడం గమనార్హం …మొత్తం 173 దేశాలకు సంబందించిన నగరాలు ఉన్నాయి. వాటిలో ఢిల్లీ ,ముంబై ,చెన్నై 141 , 144,  147, 148  స్థానాల్లో నిలిచాయి. అన్ని రకాలుగా అభివృద్ధి జరిగింది ప్రపంచమే మనవైపు చూస్తుందని చెపుతుంటే నివాస యోగ్యానికి కావాల్సిన సదుపాయాలు ఇక్కడ లేవని సర్వే సంస్థ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఆస్ట్రియా రాజధాని వియెన్నా నిలిచింది. రెండో స్థానంలో డెన్మార్క్ లోని కోపెన్ హాగెన్, ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్, సిడ్నీలు నిలిచాయి. ఈ జాబితాను ‘ది ఎకనామిస్ట్’కు చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసింది. ఈ జాబితాలో 173 దేశాల పేర్లు ఉన్నాయి. హెల్త్ కేర్, విద్య, మౌలిక సదుపాయాలు, పర్యావరణం తదితర ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. టాప్ 10 నగరాల్లో కెనడాకు చెందిన 3 నగరాలు కల్గరీ, వాంకోవర్, టొరంటో ఉన్నాయి. స్విట్జర్లాండ్ కు చెందిన జూరిచ్, జెనీవా కూడా స్థానం దక్కించుకున్నాయి.

మన దేశం విషయానికి వస్తే జాబితాలో బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబైలు ఉన్నాయి. ఢిల్లీ, ముంబైలు 141వ స్థానంలో, చెన్నై 144వ స్థానంలో, అహ్మదాబాద్, బెంగళూరు సిటీలు 147, 148 స్థానాల్లో ఉన్నాయి. జాబితాలో మన గ్లోబల్ సిటీ హైదరాబాద్ కు చోటు దక్కకపోవడం గమనార్హం.

Related posts

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై ప్రశ్నించగా నాగచైతన్య సమాధానం ఇదే!

Ram Narayana

కారు నడిపిన కేసీఆర్… రంగంలోకి వస్తున్నారంటూ కామెంట్లు!

Ram Narayana

రూ. 5 వేలతో పుష్పక్ జనరల్ బస్‌పాస్‌లు తెచ్చిన తెలంగాణ ఆర్టీసీ!

Ram Narayana

Leave a Comment