Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

భార్యకు మత్తు మందు ఇచ్చి.. పరాయి పురుషులకు ఆహ్వానం.. 92 మంది అత్యాచారం…

భార్యకు మత్తు మందు ఇచ్చి.. పరాయి పురుషులకు ఆహ్వానం.. 92 మంది అత్యాచారం…

  • ఫ్రాన్స్ లోని మజాన్ లో ఓ వ్యక్తి దారుణం
  • పదేళ్ల కాలంలో 92 సార్లు అత్యాచారం
  • 51 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

తనను నమ్మి వచ్చిన భార్యను ఓ ఉన్మాది నిలువునా మోసగించాడు. పరాయి పురుషుల కోరికలు తీర్చే వస్తువుగా మార్చాడు. ఈ దారుణం ఫ్రాన్స్ లోని మజాన్ లో చోటు చేసుకుంది. టెలీగ్రాఫ్ కథనం మేరకు.. డొమినిక్ అనే వ్యక్తి తన భార్యకు ప్రతి రోజూ రాత్రి లోరజపామ్ అనే సెడేటివ్ మందును అన్నంలో కలిపి తినిపించే వాడు. దాంతో ఆమె స్పృహ తెలియకుండా నిద్రపోయేది. ఇక ఆ సమయంలో డొమినిక్ దారుణానికి తెగించే వాడు.

పరాయి పురుషులను తన ఇంటికి ఆహ్వానించి భార్యను అప్పగించే వాడు. 26 ఏళ్ల నుంచి 73 ఏళ్ల మధ్య వయసు వారు ఇందులో పాల్గొన్నారు. ఇలా భార్యపై పరాయి పురుషులు అత్యాచారం చేస్తున్న తతంగాన్ని డొమినిక్ వీడియో తీసి యూఎస్ బీ డ్రైవ్ లో స్టోర్ చేసే వాడు. అదిప్పుడు పోలీసుల స్వాధీనంలో ఉంది. 2011 నుంచి 2020 మధ్య ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి. మొత్తం 92 సార్లు అత్యాచారం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. 51 మందిని అరెస్ట్ చేయగా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. డొమినిక్, సదరు మహిళకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

2011 నుంచి 2020 మధ్య కాలంలో ఈ దారుణాలు సాగించాడు. మొత్తం 92 సార్లు అత్యాచారం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. పొగతాగే, పెర్ ఫ్యూమ్ కొట్టుకొని వచ్చే వారిని డొమినిక్ ఆహ్వానించే వాడు కాదు. ఆ వాసనకు తన భార్య స్పృహలోకి వస్తుందని జాగ్రత్తలు తీసుకునే వాడు. తన నివాసానికి దూరంగా వాహనాలను పార్క్ చేసి రావాలని కోరేవాడు. తన భార్య వంటిపై చేతులు వేస్తే స్పర్శ తెలియకుండా వేడి నీళ్లతో చేతులు కడుక్కుని వెళ్లాలని అతిథులను కోరేవాడు.

Related posts

రోజుకు రూ. 200 కోసం.. భారత కోస్ట్ గార్డ్ రహస్యాలను పాక్‌కు అమ్మేస్తున్న కూలీ!

Ram Narayana

శామీర్ పేట్ లో బస్సు దగ్ధం.. యువకుడి మృతి

Ram Narayana

పట్టపగలే శ్రీవారి హుండీలో దొంగతనం!

Ram Narayana

Leave a Comment