Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కీలకమైన 96 గంటలు: గురువారం నాటికి జలాంతర్గామిలో ఆక్సిజన్ పూర్తి…

టైటానిక్ శిథిలాల పక్కనే…: తప్పిపోయిన టైటాన్ జలాంతర్గామి గుర్తింపు!

  • టైటాన్ జలాంతర్గామి కోసం వెతుకుతున్న ప్రాంతంలో శిథిలాల గుర్తింపు
  • టైటాన్ ను వెతికేందుకు పంపిన రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్
  • శకలాలను గుర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ వెల్లడి

తప్పిపోయిన టైటాన్ జలాంతర్గామి కోసం వెతుకుతున్న ప్రాంతంలో శిథిలాలను గుర్తించినట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, వివరాలు వెల్లడించనున్నారు. టైటాన్ ను వెతికేందుకు పంపిన రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్ కొన్ని టైటాన్ శకలాలను గుర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ ట్వీట్ చేసింది. రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్ పంపిన సమాచారాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నట్లు తెలిపింది. టైటానిక్ ఓడ శిథిలాల పక్కనే టైటాన్ శకలాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది

కీలకమైన 96 గంటలు: గురువారం నాటికి జలాంతర్గామిలో ఆక్సిజన్ పూర్తి…

  • గల్లంతైన టైటాన్ సబ్‌మెరైన్ కోసం పెద్ద ఎత్తున గాలింపు
  • జలాంతర్గామి 12,500 అడుగుల లోతున ఉన్నట్లు అంచనా
  • ఆక్సిజన్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పిన యూఎస్ కోస్ట్ గార్డ్!

Debris field found in Titan submersible search area

అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన టైటానిక్ సబ్‌మెరైన్ ఆచూకీ కోసం పెద్దఎత్తున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయిదుగురితో ఆదివారం బయలుదేరిన జలాంతర్గామి కనిపించకుండా పోయి కీలకమైన 96 గంటలు దాటింది. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. మినీ సబ్ మెరైన్ లోని ఆక్సిజన్ కూడా దగ్గరపడింది. 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉంది. ఇది కాస్తా గడుస్తుండటంతో సందర్శకుల క్షేమంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆక్సిజన్ పూర్తి కావొస్తుండటంతో వారి ప్రాణాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.

జలాంతర్గామి సముద్ర ఉపరితలం నుండి 12,500 అడుగుల లోతున ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనిని గుర్తించేందుకు యూఎస్ కోస్ట్ గార్డు, ఇతర రోబోట్లు, ప్రపంచవ్యాప్తంగా రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగింది. అమెరికా, కెనడా యుద్ధ విమానాలు, ఉపగ్రహాలు, భారీ నౌకలను రంగంలోకి దించి సముద్రాన్ని జల్లెడ పడుతున్నారు. జలాంతర్గామి టైటాన్ సముద్ర గర్భంలో ఏవైనా శకలాల మధ్య చిక్కుకుపోయి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత ఆధునాతన సాంకేతికతతో కూడిన రోబో జలాంతర్గామి సహాయం తీసుకున్నారు. రెస్క్యూ బృందాలు సముద్రంలో నాలుగు కిలో మీటర్ల లోతున వెతుకుతున్నాయి.

టైటానిక్ షిప్ శిథిలాలు ఉన్న ప్రాంతాన్ని మిడ్ నైట్ జోన్ గా పిలుస్తారు. అక్కడ ఉష్ణోగ్రతలు శీతలంగా ఉంటాయి. పూర్తిగా చీకటిగా ఉంటుంది. సబ్ మెర్సిబుల్ లోని లైట్లతో కేవలం కొంత దూరమే కనిపిస్తుంది. దాదాపు రెండున్నర గంటల పాటు చీకటిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

టైటాన్ జలాంతర్గామిలో ఆక్సిజన్ సరఫరా గురువారం సాయంత్రం గం.12.08కి పూర్తి కావొచ్చునని యూఎస్ కోస్ట్ గార్డ్ అంచనా వేశారు. గల్లంతైన సబ్ మెరైన్ లో బ్రిటిషన్ బిజినెస్ మెన్, అడ్వెంచరర్ హమీష్ హార్డింగ్, పాకిస్తాన్ కు చెందిన యూకే వ్యాపారవేత్త షెహ్జాదా దావూద్, అతని తనయుడు సులేమన్ దావూద్, ఓసియన్ గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఫౌండర్ స్టాక్టాన్ రష్, ఫ్రెంచ్ సబ్ మెరైన్ పైలట్ పాల్ హెన్రీ నార్గోలెట్ ఉన్నారు.

Related posts

భారత్ లో ఎంట్రీ ఇస్తున్న చైనా బైకులు!

Drukpadam

‘మేడిన్ తెలంగాణ’ ఎలక్ట్రిక్ కార్..ఒక్కసారి చార్జ్ చేస్తే 1,200 కిలోమీటర్ల జర్నీ..

Drukpadam

Millennials Have A Complicated Relationship With Travel

Drukpadam

Leave a Comment